జీవితం ఎంతో ప్రశస్త్యమైనది. -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

జీవితం ఎంతో ప్రశస్త్యమైనది. -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

జీవితం ఎంతో ప్రశస్త్యమైనది.
-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
---------------------------------------
స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందస్తు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకుని  అవగాహన సదస్సు స్థానిక నోబుల్ ఓకేషనల్ జూనియర్ కళాశాల,ఆదోనిలో శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆత్మహత్యల కారణాలు, నివారణ మార్గాలు,జీవితం ఎంతో  ప్రశస్త్యమైనదని,క్షణికావేశంలో నిండు నూరేళ్ళ జీవితం నాశనం చేసుకోరాదని,ఆత్మహత్యల రాహిత్య భారతదేశం చూడాలని వక్తలు ,ఉపాధ్యాయులు, కవులు గద్వాల సోమన్న, ఆరెకటికె నాగేశ్వరరావు తమ సందేశమిచ్చారు.ఆ కళాశాల కరెస్పాండెంట్ సంగటి దేవదానం గారు,ప్రిన్సిపాల్ అబ్దుల్ బాషా స్పందన ఫౌండేషన్ చైర్మైన్ డా.ఈదా శామ్యూల్ రెడ్డి నిస్వార్ధ సేవలు కొనియాడారు..అనంతరం బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న మరియు నాగేశ్వరరావు, కళాశాల కరెస్పాండెంట్ దేవదానం, వారి సతీమణిని సత్కరించారు.ఈ సదస్సులో నోబుల్ ఓకేషనల్ జూనియర్ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments