శీర్షిక:మనుగడెలా? పేరు: సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక:మనుగడెలా? పేరు: సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక: మనుగడెలా?

వానలెక్కడున్నయో
ఇన్నాళ్లు
ఎడతెరిపిలేకుండా
ఊపిరి సలపనీయడంలేదు
సూర్యుడు అలసిపోయాడేమో 
వర్షానికి భాద్యతనప్పగించి
సేదతీరేందుకు సెలవులున్నాడేమో
వర్షం అలసటలేకుండా అవనినంతా అతలాకుతలం చేస్తున్నది
ఆకాశం మబ్బులపందిరితో చల్లదనాన్ని భువిపైకి నిత్యం చిలకరిస్తున్నది
ఆటంకాలను ఆవిష్కరిస్తున్నది 
చిన్నపాటి జీవితంలో అలజడి రేపుతున్న దృశ్యం
వర్షకాలరోగాలతో దవాఖానాలో జనం కిటకిటలాడుతున్నరు
సర్కారు బడులక్కడక్కడ కూలబడుతున్నయ్
చదువు వర్షార్పణం
గుడులుమాత్రం పటిష్టం
రైతులకైతే దిక్కుతోచని దీనస్థితి
పంటల్ని ముంచేస్తున్న వాననుజూసి 
ఒక్కోసారి అతివృష్టి మరోసారి అనావృష్టి
చిల్లర వ్యాపారమంతా చిన్నాభిన్నం
వానమ్మ దయచూపు మనుగడ సాగేందుకు

సి. శేఖర్ (సియస్సార్),
పాలమూరు,
9010480557.

హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.

0/Post a Comment/Comments