కన్నవారు వేల్పులు-గద్వాల సోమన్నఎమ్మిగనూరు

కన్నవారు వేల్పులు-గద్వాల సోమన్నఎమ్మిగనూరు

కన్నవారు వేల్పులు
------------------------------ 
అవసాన దశలోన
ఆదరిస్తే పుణ్యము
అమ్మానాన్నల ఋణము
తీర్చుకుంటే  భాగ్యము

సేవలెన్నొ చేశారు
గుర్తించుకో నేస్తము
రుధిరమే పంచారు
మరువకోయి సత్యము

కఠినత్వం వదలాలి
ప్రేమపూలు రువ్వాలి
వృధ్యాప్యం తప్పదోయ్!
వారి సేవ చేయాలి

కనిపించే వేల్పులు
కన్నవారు జగతిలో
పదేపదే తలచుకో
అనునిత్యం మనసులో
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580.

0/Post a Comment/Comments