పుట్టమన్ను పోసుకున్న పురుడుతో మొదలు పూల బతుకమ్మగా..
బతుకు నిలిపే సిరివల్లి రోజుకొక్క తీరుగా
నిత్య శోభాయమానమే
నిత్య మంగళప్రదాయమే..
సంగీత సాహిత్యాల సమ్మేళనమే
బతుకమ్మ పాటలుగా
బతుకు సత్యాలను చెప్పి
తనదైన బాణీలో జనాదరణ పొందే సాంప్రదాయమే..
నా తంగేడు పూల
బంగారు వర్ణం బతుకమ్మ
ఏడేడు తరాల గాథలలను
అందంగా తవ్విపోసే ఇంపైన సరాగాల సంబరమే..
వ్యవసాయీల ఐక్యత..
పంట చేల వయ్యారాలు..
సున్నిత శృంగారాలు..
వీరుల త్యాగాలూ....
తీరోక్క పూల తీరు
బతుకమ్మ పాటల్లోనే ఒదిగీ
మన జీవనాడే బతుకమ్మాయే...
అర్రెం నాటి బతుకమ్మా
నీకు అపచారమే జరిగెనా
మాంసం ముద్ద తగిలి..
అలిగి అలంకరణకు దూరమైతివా...
ఘనమైన పొన్నపూలేవి
గజ్జలా ఒడ్డాణామేది..
గునుగు గుమ్మడీ పూలేవీ
బంతి చామంతుల వరుసలేవీ...
అర్రెం నాటి బతుకమ్మను జూసి
ఆట చిలుకలు లేక
పాట చిలుకలు లేక...
వాడలన్ని చిన్నబోవగా
వాయనాలందుకోమమ్మా వనితలమంతా...
*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*