శీర్షిక: ఎన్నికలొస్తేచాలు
వాళ్ళంతే
నాయకులు
ఎన్నికలొస్తున్నాయంటే
ఎన్నైనా నమ్మబలుకుతరు
కులాన్నడ్డువెట్టుకొనికొకరు
మతాన్నడ్డవెట్టుకొనొకరు
తోచిందల్లా తోసేస్తరు
లేనో నిప్పు రాజేస్తరు
చీల్చతూ కుర్చీనాక్రమిస్తరు
బహుజనులగావాల్సింది
పేరుగాదు
రాజకీయాధికారం
పెత్తనాన్ని చెలాయించేందుకు మస్తుగ జిమ్మిక్కులుజేస్తున్నరు
వాళ్ళతో కుమ్ముక్కైయ్యారో
మారని తలరాతలకు వారసులౌతరు
బహుజనమా కళ్శుతెరువు
చూసుకో ఆలోచన చేసుకో
భవిష్యత్తు భద్రంగా నిర్మించుకో
వాళ్ళమాటలన్ని నీ ఓటును దోచేందుకేనని తెలుసుకో
వెనుతిరిగి చూసకో
మారని నీ బతుకుతీరును
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.