జయం జయం ఐలమ్మ

జయం జయం ఐలమ్మ

నేడే చాకలి ఐలమ్మ జయంతి 
ఆమె పోరాటమే నేటి మహిళలు అలవర్చుకోవాలి అని వివరించి న కవి లెక్చరర్
వైద్య.శేషారావు

వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. 1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది.
ఆమె
 ఈ భూమి నాది పండించిన పంట నాది ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను
తెలంగాణ ఉద్యమకారిణి .తొలి భూపోరాటానికి నాంది పలికిన వీర నారి. దేశ్ ముక్ లపై  కమ్యూనిస్టు ల తో కలిపి  పోరాటం చేసి విజయం సాధించి కాలినడకన వెళ్లి రోకలి బండ తో తిరగ బడ్డ వనిత దోపిడీ దారు ల కబంధ హస్తాల నుండి తన భూమిని తను తీసుకొని 90 ఎకరాల భూమి పంపిణీ చేసింది
    ఇక్కడ ఈ ప్రస్తవన ఎందుకంటే నేటి మహిళలు చిన్న చిన్న సమస్యల కె ఆత్మ విశ్వాసం కోల్పోయి బలవన్మరణం పొందుతూ న్నారు.చదువుకున్న వారు సైతం తమకు రావాల్సిన హక్కుల పై రాజీపడుతున్నారు
ఆమె ఒక బాగా వెనక బడ్డ ఉత్పత్తి కులమైన రజక కులం లో పుట్టి చదువు లేకున్నా
తన భూమి పై ఉన్న మమకారం తో తిరుగుబాటు చేసి తెలంగాణ లో ఒక మార్పుకు శ్రీకారం.ఒక చైతన్య దీప్తి.ఉత్పత్తి కులాలు వెనుకబడిన కులాలు,మహిళలు రాజ్యాధికారం లో భాగస్వామ్యం కు చైతన్యము నింపిన ఆమె జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం 2022 అధికారికంగా నిర్వహించడం ఒక ముదువహం
     ఒక తిరుగుబాటు బావుటా
పోరాటానికి డిగ్రీ లు కాదు
ఖలేజా ముఖ్యం
రజాకార్ల ఆగడాలకు అడ్డుగా నిలిచి
దేశముక్ ల భూస్వామ్య పు పోకడలు ఎదిరించి
భూమి కోసం పోరాడిన
ఐలమ్మ  తెలంగాణ జాతి రత్నం
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి కీలకతు రాయి
అన్యాయాన్ని ఎదిరించి
అభ్యుదయ భావాలకు
బీజం పోసి మహిళ శక్తి కి
నిరూపమానం ఐలమ్మ
నీ జ్ఞాన పాకాలు పదిలంగా
మదిలో స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి

0/Post a Comment/Comments