రామ రామ రామ ఉయ్యాలో..
రామనే శ్రీరామ ఉయ్యాలో..
హరి హరి ఓ రామ ఉయ్యాలో..
హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో..
చూడ చక్కని తల్లి ఉయ్యాలో..
చలువ చూపుల తల్లి ఉయ్యాలో..
తొలిసంధ్య కిరణాలు ఉయ్యాలో..
పసిడి రంగు పులిమే ఉయ్యాలో..
అడవి గడ్డి పూలు ఉయ్యాలో..
అందంగా పూసేనే ఉయ్యాలో..
బంతి చామంతులు ఉయ్యాలో..
మురిసి పోతున్నాయమ్మ ఉయ్యాలో..
రామ రామ రామ ఉయ్యాలో..
రామనే శ్రీ రామ ఉయ్యాలో..
రెండెత్తులపైన గౌరమ్మ ఉయ్యాలో..
నిలిచి నవ్వుతున్నాదమ్మ ఉయ్యాలో..
ఆడబిడ్డల చేతులు ఉయ్యాలో..
ఊయ్యాలగా మారే ఉయ్యాలో..
బారసాల చేసెను ఉయ్యాలో..
బతుకు నిలపాలని ఉయ్యాలో..
నవ రూప బతుకమ్మ ఉయ్యాలో..
నడిచి వస్తున్నాదమ్మ ఉయ్యాలో..
రామ రామ రామ ఉయ్యాలో..
రామనే శ్రీరామ ఉయ్యాలో..
తెలుగింటి బతుకమ్మ ఉయ్యాలో..
లోకమంతా ఆడవట్టే ఉయ్యాలో..
ఆటపాటల్లోన ఉయ్యాలో..
అమ్మలక్కలంతా ఉయ్యాలో..
మునిగితేలుతున్నారమ్మ ఉయ్యాలో..
మెరిసిపోతున్నరమ్మ ఉయ్యాలో..
చెరువు మీద చేరి ఉయ్యాలో..
కనువిందు చేసేనే ఉయ్యాలో..
నింగి చుక్కలోలే ఉయ్యాలో..
నేల పూలు చూడు ఉయ్యాలో..
రామ రామ రామ ఉయ్యాలో..
రామనే శ్రీరామ ఉయ్యాలో..
పంచుకున్నారమ్మ ఉయ్యాలో..
పసుపు కుంకుమలు ఉయ్యాలో..
ఇచ్చుకున్నారమ్మ ఉయ్యాలో..
అటుకుల వాయనాలు ఉయ్యాలో..
ఆరగించేనమ్మ ఉయ్యాలో..
భక్తి మీర ఇంతులుయ్యాలో..
చల్లని చూపులు ఉయ్యాలో..
మాపైనే చూపెనే ఉయ్యాలో..
రామ రామ రామ ఉయ్యాలో..
రామనే శ్రీరామ ఉయ్యాలో..
*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*