గురువు

గురువు

సూర్యుడు
చీకట్లను చీల్చి వెలుతురును
ఇచ్చే దివిటి
తరాలు ఎన్నిమరీనా
అంతరాలు ఎన్ని వచ్చిన
గురుస్తానం గురితప్పదు
ఎత్తుపల్లలు సహజం
కాలం తో ఆహార్యం మారింది
సమాజం ఆలోచనల్లో మార్పులు
విద్యాకై గురువుల వద్దకు 
నేడు పిల్లల వద్దకు పరుగులు
గీతను బోధించిన జగద్గురువు
శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద
సంస్కారి అయ్యాడు
కార్పొరేట్ కల్చర్లో
ఉపాధ్యాయులు స్థితి మరే
ధనం చుట్టూ భ్రమించే
అప్పుడు బోధించారు
జీవన భుక్తి ముక్తి
ఇప్పుడు మార్కులు పండించే
యంత్రాలు
కృతిమ జీవన విధానాలు
కాలం కాటేసింది
 సన్మార్గం  మసుక బారింది
మార్కులు తక్కువ వేశారు అని చెట్టుకట్టేసిరి విద్యార్థులు
మరికొందరు బోధన వృత్తిలో
విద్యార్థుల పై లైంగిక వేధింపులు
ఏకలవ్యుడు గురువును మనుసు తో జయించే
గురువు ఆజ్ఞకు బొటనవేలు
తృణప్రాయంగా సమర్పించే
యుగాలు ఎన్ని మరీనా
తల్లి జన్మ నిస్తుంది
అక్షరం నేర్పే క్షరం లేనిది
గురువే
ఏ రంగం అయిన
చెట్టు ముందా విత్తు ముందా
అప్రస్తుతం
చెట్టును సృష్టించే
విత్తు పూడిమి
వంటివాడు గురువు
అంతర్లీనంగా దాగి ఉన్న
సత్యం ఈ లోకమే గురువు
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
దోమకొండ

0/Post a Comment/Comments