అక్షరం
క్షారం లేనిది అక్షరం
క్షీరం అయి చల్ల బర్చు
కాంతి ఇచ్చు దీపం అయి
గమనం మార్పు పవనం అయ్యి
మోసాలను కూల్చే క్షిపణి అయ్యి
ప్రవర్తనను నేర్పి
విలువను కూర్పు
ఆయుధం కన్నా శక్తివంతం
అవ్వ భాషలో రాయడం
చదవడం తెలిస్తే
గతి మారును స్థితి మరును
వ్యక్తిగా అవస్థలు అక్షర జ్ఞానం
లేక ఎవగింపు లు
ఇసాడి0పులు
దేశాభివృద్ధి మందగమనం
కుటుంబ నిర్వహణ ఇక్కట్లు
అక్షరంలేక పోతే ఎన్నో మిత్యాలు
అది ఉంటే తప్పును తిప్పలు
జానపదం అయిన
వ్యక్తిగత జీవితం కూడా బజార్లో
అందుకే లక్షిమి కొందరిది
సరస్వతి అందరిదీ
నీకోసం చదువు కో
వయస్సు తో పనిలేదు
అక్షరమే మిన్న అదే జీవితం
యధార్థం
పలుక బలపం పట్టు
అక్షరం నేర్చుకో ఆకృతి మార్చుకో
ఉమశేషారావు వైద్య
లెక్చరర్,దోమకొండ
Post a Comment