నేడే కాళోజీ జయంతి

నేడే కాళోజీ జయంతి

తెలంగాణ వాదం కోసం పరితపించిన మన కాళోజీ
కవి లెక్చరర్ వైద్య.శేషారావు
కామారెడ్డి జిల్లా దోమకొండ
సెప్టెంబర్,8(ప్రజాజ్యోతి)
 నేడు కాళోజీ జయంతి. తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని తెలంగాణ బాష్దినోత్సవం గా అధికారికంగా ప్రకటించి నిర్వహిస్తుంది.ఆయన స్మరణ సూక్ష్మంగా చేసుకోవడం మన బాధ్యత ఆయన  విశాలాంధ్రను సమర్ధించినప్పటికి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి నిజం నవాబు ను ఎదిరించిన దీశా లి జాతీయ జెండాను ఎగురవేసినందులకు ,నిజాంను ధిక్కరి0చినందులకు 1939,1943 జైలు లో బంధించింది.తన బతుకంత తెలంగాణ కోసం ప్రయత్నించి నా గొడవ తో తన ఆత్మకథను రాదుకున్నాడు.అన్యాయం ఎక్కడ ఉంటే ఎదిరిస్తే తృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని ఏ రకమైన అన్యాయం ఉండవద్దు అని చేతల్లోనూ రాతల్లోనూ చూపిన గొప్ప కవి.
    గ్రంథాలయ ఉద్యమానికి ఆద్యుడై బాషా వ్యాప్తి కి కృషి చేసి తెలుగు వాడివి అయి ఉండి తెలుగు రాదు అని చెప్పుట కు సిగ్గుపడాలి అని నిరాటకంగా చెప్పిన వ్యక్తి
మాండలిక బాషా ను,తెలంగాణ భాషను ప్రేమించిన కాళోజీ అంతరాన్ని అర్థం చేసుకొని వీలనిజానికి వాడిన మన బాషా కె.సి ఆర్ కృషి వల్ల నేడు గుర్తింపు పొందింది. తెలంగాణ మాండలికం మరియు వ్యావహారిక  బాషా బతికింది.ఆయన సాహిత్యన్ని మనం చర్చించే స్థాయి మనకు లేదు
ఆంధ్ర జన సంఘము, ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్ర మహాసభ,తెలంగాణ రచయితల సంస్థల నిర్మాణం లో కాళోజీ పాత్ర ఉంది
పి.వి నర్సింహ రావు,నేడు కె.సి.ఆర్ కూడా లాంటి వ్యక్తులు అతనిచే ప్రభావితం అయిన వారే
    విశాలాంధ్ర పరిస్థితులను గమనించి 1969 లో తేలంగాణ ఉద్యమం లో కలిసినాడు
మానవతా వాదీ హేతు వాదీ అయిన కాళోజీ 1992 లో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సాహిత్య అకాడమీ,అనేక అవార్డులు అతని సొంతం
ఆహార్యం మారలేదు ప్రశ్నించే తత్వం మారలేదు వివక్షతలు లేని,మూఢ నమ్మకాలు లేని హేతువాదం తో పాటు అందరూ సమానత్వం తో పాటు మనబాషకు పట్టం కడితేనే ఆయనకు నిజమైన నివాళి

0/Post a Comment/Comments