పారిజాత సొగసులా గౌరమ్మా..
పసుపు కుంకుమల గౌరమ్మా..
ఆడి పాడి మురిసేరు గౌరమ్మా..
ఆడపడుచులంతా గౌరమ్మా..
తంగేడు మెరుపుల గౌరమ్మా..
తనివితీరా చూడు గౌరమ్మా..
కొమ్మల్లో మొలిచిన గౌరమ్మా..
మొగ్గల పూత జూడు గౌరమ్మా..
పసిడి వెండి వెలుగులు గౌరమ్మా..
పచ్చని వాకిళ్ళు గౌరమ్మా..
పల్లె పట్నమంత గౌరమ్మా...
బతుకమ్మ ఆటలే గౌరమ్మా..
పారిజాత సొగసులా గౌరమ్మా..
పసుపు కుంకుమల గౌరమ్మా..
ఆడి పాడి మురిసేరు గౌరమ్మా..
ఆడపడుచులంతా గౌరమ్మా..
మట్టిబిడ్డ ఆరాటం గౌరమ్మా..
కరుణ జూపుమూ గౌరమ్మా..
నిండునీళ్ల కుండోలే గౌరమ్మా..
నింగి ఉన్నదమ్మా గౌరమ్మా..
నిండుపాలకొండోలే గౌరమ్మా..
వెన్నెలున్నాదమ్మా గౌరమ్మా..
చెమట చుక్కల్లో గౌరమ్మా..
రత్నాల రాశులు గౌరమ్మా..
రత్నాల రాశులు గౌరమ్మా..
రందులు బాపును గౌరమ్మా..
పారిజాత సొగసులా గౌరమ్మా..
పసుపు కుంకుమల గౌరమ్మా..
ఆడి పాడి మురిసేరు గౌరమ్మా..
ఆడపడుచులంతా గౌరమ్మా..
గౌరమ్మ నీవైభోగం గౌరమ్మా..
ఏమని చెప్పేది గౌరమ్మా..
గోరంట పూలలో గౌరమ్మా..
పట్టు కుచ్చుల్లోన గౌరమ్మా..
గుమ్మాడి పువ్వుల్లో గౌరమ్మా..
గునుగు కట్టల్లోన గౌరమ్మా..
వేవేల మనసులతో గౌరమ్మా..
నిన్ను కొలిచెదరమ్మ గౌరమ్మా..
పారిజాత సొగసులా గౌరమ్మా..
పసుపు కుంకుమల గౌరమ్మా..
ఆడి పాడి మురిసేరు గౌరమ్మా..
ఆడపడుచులంతా గౌరమ్మా..
పసిడి వెలుగుల గౌరమ్మా..
నాలుగంతరాలలో గౌరమ్మా..
నాలుగు అంతరాలలో గౌరమ్మా..
నిలిచి ఉన్నాదమ్మా గౌరమ్మా..
పడతులంతా చేరి గౌరమ్మా..
ఆటపాటలెన్నో గౌరమ్మా..
కోలాటం ఆడేరు గౌరమ్మా..
కోల్ కోల్ అని పాడేను గౌరమ్మా..
పారిజాత సొగసులా గౌరమ్మా..
పసుపు కుంకుమల గౌరమ్మా..
ఆడి పాడి మురిసేరు గౌరమ్మా..
ఆడపడుచులంతా గౌరమ్మా..
భక్తితో నిను తలిచేరు గౌరమ్మా..
ముక్తికై ఎదురు చూసేరు గౌరమ్మా..
నాన్న బియ్యం తోడు గౌరమ్మా
బెల్లము కలగలిపి గౌరమ్మా..
నైవేద్యంగా నీకు గౌరమ్మా..
అందుకో మాయమ్మ గౌరమ్మా..
అమ్మలక్కలంతా గౌరమ్మా..
ఆరగించేరమ్మ గౌరమ్మా..
ఆనందంగా ఇంతులు గౌరమ్మా..
ఇండ్లకేగునమ్మా గౌరమ్మా..
పారిజాత సొగసులా గౌరమ్మా..
పసుపు కుంకుమల గౌరమ్మా..
ఆడి పాడి మురిసేరు గౌరమ్మా..
ఆడపడుచులంతా గౌరమ్మా..
*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*