"గురు స్పందన" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం

"గురు స్పందన" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం

"గురు స్పందన" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నను "గురు స్పందన"పురస్కారం వరిచింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోవడమే కాకుండా ,అచిర కాలంలోనే దాదాపు 23 పైగా పుస్తకాలు వ్రాసి,ముద్రించి తన ప్రతిభను చాటుకున్నారు.గణితో పాధ్యాయుడైనా తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో  గద్వాల సోమన్న విశేష కృషి చేసినందులకుగాను వీరి ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ,8 ఎలిమెంట్స్ ఆఫ్ వెల్నెస్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా చిగురు ఆశ్రమం కరకట్ట రోడ్,తాడేపల్లి,నియర్ విజయవాడలో,"స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్" చైర్మన్ డా.ఈదా శామ్యూల్ రెడ్డిగారు,డా.S. H.కులకర్ని SHK wellness chairman, శ్రీ వి.విశ్వనాథం  ప్రొఫెసెర్(Rtd) ,ఈదా అంజిరెడ్డిగారులు దుశ్శాలువా కప్పి,మెమొంటో ఇచ్చి గద్వాల సోమన్నను ఘనంగా  సన్మానించారు. పురస్కార గ్రహీత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు ,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments