HWPL SUMMIT లో -డా.చిటికెన
=====
ఇంటర్నేషనల్ యూత్ పీస్ గ్రూప్ (IPYG)హెచ్..డబ్యూ. పి. ఎల్ దక్షిణకోరియా 8వ ప్రపంచ శిఖరాగ్ర శాంతి సదస్సు వార్షికోత్సవ ఆహ్వానం మేరకు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త,పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బేనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ గౌరవ సభ్యులు -డా. చిటికెన కిరణ్ కుమార్ ప్రపంచ శాంతి సమ్మేళనంలో ఆదివారం రోజున భారతీయ కాలమానం మధ్యాన్నం 12.30 గంటలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.ప్రపంచ శాంతి గురించి, ఆక్రమణలు. దురాక్రమణలు, ఆధిపత్య భావజాలాలు, ఉగ్రవాదానికి పెను ఊతం ఇస్తున్న పరిస్థితుల్లో ప్రపంచ శాంతి ఇంకా చాలాదేశాల్లో నీటిమీద రాతల్లా కనబడుతోందని, ఇది మారాలని,అన్ని దేశాల్లో ప్రపంచంలో శాంతి పరిఢవిల్లాలని,యుద్ధంలేని, అణ్వాయుధాలు లేని, క్షిపణి దాడులు లేని, ఆకలి భాధలు లేని ప్రపంచం నిజమైన శాంతికి మార్గం తెరవాలని ప్రజానీకం ఎదురు చూస్తోందంటూ తన సందేశాన్ని తెలియజేసారు. గత సంవత్సరం 7వ ప్రపంచ సదస్సు లో కూడా డా.చిటికెన కిరణ్ కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.ఇట్టి అంతర్జాల సదస్సుకు మ్యాన్ హీలీ అధ్యక్షత వహించగా ఆరు ఖండలలోని 145దేశాల నుండి 970 మందికి పైగా ప్రపంచ శాంతి ప్రతినిధులు పాల్గొన్నారు.