ఆత్మహత్యలు లేని భారతావని కావాలి! -నోవా జార్జ్ SEIF కోఆర్డినేటర్, కర్నూల్

ఆత్మహత్యలు లేని భారతావని కావాలి! -నోవా జార్జ్ SEIF కోఆర్డినేటర్, కర్నూల్

ఆత్మహత్యలు లేని భారతావని కావాలి!
-నోవా జార్జ్ SEIF కోఆర్డినేటర్, కర్నూల్
---------------------------------------
కర్నూలు:స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకుని  అవగాహన సదస్సు స్థానిక  కెవిఆర్ బాలికల డిగ్రీ  కళాశాల,కర్నూలులో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆత్మహత్యల నివారణకు  అందరూ తమ వంతు కృషి చేయాలని,ఆ దిశలో వ్యయప్రయాసలు సహితం లెక్క చేయక నవీన భగీరథుడై  సాగిపోతున్న SEIF ఛైర్మన్ డా.ఈదా శామ్యూల్ రెడ్డి గారితో భాగస్వామ్యులై  ,ఆత్మహత్యల రాహిత్య భారతదేశముగా మార్చాలని,చూడాలని వక్తలు శ్రీ నోవా జార్జి,ఆ కళాశాల  ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరా శాంతి ,గెస్ట్ ఆఫ్ అనర్ శ్రీమతి జ్యోతిర్మయి, SEIF కోఆర్డినేటర్ డా.ఫారీదా బేగం  గారులు విద్యార్థునులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కెవిఆర్ బాలికల  కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments