బ్రహ్మ జ్ఞానం పొందు విధానం. (వ్యాసం). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

బ్రహ్మ జ్ఞానం పొందు విధానం. (వ్యాసం). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

బ్రహ్మజ్ఞానం పొందు విధానం !
-------------&&&&&&-----------
సృష్టిలోని జీవులన్నింటికీ కైవల్యాన్ని, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని ప్రసాదించే శక్తి, బాధ్యత ఒక్క శివునికే ఉన్నది. శివుడు పంచకృత్య కారకుడు. జగత్తునకు సంబంధించిన పంచ కార్యాలను నిర్వహించుటకు శివుడు బ్రహ్మ, విష్ణు, రుద్ర మహేశ్వరులను నియమించెను. బ్రహ్మ సృష్టిని, విష్ణువు స్థితిని, రుద్రుడు లయాన్ని, మహేశ్వరుడు తిరోభావాన్ని నిర్వహించాలి. ఇక ఐదవ కార్యమైన మోక్ష ప్రాప్తి సాక్షాత్తు సదాశివుడు నిర్వహిస్తాడు. అందుకే దర్శనోపనిశత్,
విరక్తస్య తు సంసారాత్ జ్ఞానం కైవల్య సాధనం 
తేనె పాపా పహాని స్స్యత్ జ్ఞాత్వా దేవం సదాశివం.
సంసారం నుండి విరత్తుడైన మానవునికి జ్ఞానమే మోక్ష సాధనం. ఇట్టి జ్ఞానముతో సదాశివుడి సాక్షాత్కారమును పొందడం వలన బ్రహ్మజ్ఞానము లభించును. మోక్ష ప్రాప్తమును పొందును.
ఆత్మసాక్షాత్కారంతోబాటు బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని పొందాలంటే మనం ముగ్గురి అనుగ్రహం తప్పక 1.శివానుగ్రహం 2. ఇష్ట దైవ అనుగ్రహం 3 .సిద్ధగురు అనుగ్రహం.
శివ అనుగ్రహం లేకపోతే ఆత్మసాక్షాత్కారం, బ్రహ్మజ్ఞానం లభించదు. ఇష్ట దైవ అనుగ్రహం, సిద్ధ గురువు అనుగ్రహం కూడా లభించవు. కాబట్టి బ్రహ్మజ్ఞానం, శివానుగ్రహం కలగడమే ముఖ్యం. అందుకే శాస్త్రం
శివానుగ్రహేణ జ్ఞాన ప్రాప్తం. అని తెలిపినది.
ఎవరికైనా, ఎవరి వారి కైనా శివానుగ్రహం, ఇష్ట దైవ అనుగ్రహం, సిద్ధ గురువు అనుగ్రహం, కలిగితే కానీ ఆత్మసాక్షాత్కారం కలగదు. ఇది ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం. కేవలం ఇష్ట దైవాన్నే పట్టుకొని వేలాడితే ప్రయోజనం శూన్యం. సిద్ధ గురువును సేవించాలి. శివుడిని ఆరాధించాలి. అలా ముగ్గురిని ఆరాధిస్తే గాని  మనకు బ్రహ్మజ్ఞానం సంప్రాప్తం కాదు.
కాబట్టి ఈ అసలు రహస్యాన్ని తెలుసుకొని నిత్యం ఆ శివుడిని ఆరాధించు, పూర్ణత్వాన్ని సాధించు. ఆపై బ్రహ్మజ్ఞానమును పొందు.
ఓం నమశ్శివాయ! ఓం నమశ్శివాయ! ఓం నమశ్శివాయ!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ .9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments