అర్ధనారీశ్వరి (చిట్టి కథ). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత, బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి.కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

అర్ధనారీశ్వరి (చిట్టి కథ). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత, బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి.కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

అర్ధనారీశ్వరి (చిట్టి కథ)
-----------&&&--------------
ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై మహాశివుడు తన ప్రథమ గణాలతోను, సకల దేవతలతను కొలువై తన ప్రియ పార్వతీదేవిచే సకల సపరియలు చేయించుకొనువాడై పూజలు అందుకొనుచుండగా, అప్సరసలకు పోటీగా బృంగి అను శివుని ద్వారపాలకుడు వికట నాట్యం చేస్తూ అందరినీ నవ్వించినాడు. అందుచేత శివుడు బృంగిని మెచ్చుకొని అతన్ని అనుగ్రహించాడు. అమిత ఆనందంతో బృంగి పొంగిపోయి శివుని భార్య పార్వతీదేవిని తృణీకరించి కేవలం శివుని చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేశాడు. పక్కనే ఉన్న శివుని భార్య పార్వతి దేవి తనని వదిలి కేవలం శివునికి మాత్రమే ప్రదక్షణ చేయడానికి కారణం ఏమిటని తన పతిని ప్రశ్నించింది. అందుకు శివుడు"భవాని! యోగులకు నీవల్ల ప్రయోజనం ఏముంది? అందువల్లనే బృంగి నాకు మాత్రమే ప్రదక్షిణ చేశాడని ప్రత్యుత్తరం ఇచ్చెను.
          శివుని సమాధానంతో తృప్తి పడని పార్వతి భర్త పై అలిగి కోపంతో దేవతలెంత వారించిన వినక వెంటనే కైలాసమును వదిలి గౌతమ మహామునిచే ఉపదేశాన్ని పొంది కేదారేశ్వర స్వామిని పూజిస్తూ ఘోర తపస్సు చేశెను. అంతట శివుడు పార్వతీదేవి తపస్సును మెచ్చుకొని వెంటనే సాక్షాత్కరించారు. అప్పుడు పార్వతి తన భర్త యైన శివున్ని దేహంలోని అర్థ శరీరాన్ని పొందేలా వరం ఇవ్వమని కేదారేశ్వర స్వామిని కోరెను. ఆమె కోరిక ప్రకారంగా కేదారేశ్వరుడు వెంటనే అలా వరాన్ని ఇవ్వడం వల్ల ఆనాటి నుండి పార్వతి అర్ధనారీశ్వరి అయింది.
             శివుడు జ్యోతిర్లింగంగా ఉన్నప్పుడు గతంలోన విష్ణు కోరిక మేర ప్రసన్నుడై వరమును కోరుకోమనగా, విష్ణువు నేనే సర్వస్వామ్యుడను, విశ్వవ్యాప్తి ధరుడను నన్ను మించిన వారు లేరని గర్వంతో నీవు నాకు సేవ చేయుము అని కోరెను. ఆ దోషము చేత విష్ణువే శివునకు అర్ధనారిగా పుట్టెను. ఆ అర్ధనారే అర్ధనారీశ్వరిగా పూజలందు కొనుచున్నది.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments