దసరా ముత్యాల హారాలు (కవిత). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత బాలమిత్రుల ల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం సెల్.9491387977.

దసరా ముత్యాల హారాలు (కవిత). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత బాలమిత్రుల ల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం సెల్.9491387977.

దసరా-ముత్యాల హారాలు!
--------------------------------------
సరదా సరదా దసరా
వస్తుంది నీవిక కనరా
దేవీ స్తోత్రం వినరా
జయహో మాతా అనరా !

దసరా పండుగ వస్తుంది
ఆనందాన్ని ఇస్తుంది
సంబరాలను తెస్తుంది
అందరినీ అలరిస్తుంది !

శుభోదయాన్నే లేస్తాం
మా స్నానం చేసేస్తాం
దుర్గామాతను పూజిస్తాం
వరమివ్వాలని అర్థిస్తాం!

బంధుమిత్రులను కలుస్తాం
విందు చేయుటకు పిలుస్తాం
బంగారం పంచేస్తాం 
మేం దీవెనల అర్థిస్తాం !

శాస్త్ర శోధన చేస్తాం
పర్వం ఫలమునూ చూస్తాం
నవరాత్రుల జరిపిస్తాం
జన జాతరను చూపిస్తాం !

జమ్మి కొమ్మను తెప్పిస్తాం
 బాపనయ్యను రప్పిస్తాం
పత్రిపూజలను చేసేస్తాం 
రాత్రి జనుల మురిపిస్తాం !

ఆయుధ పూజలు చేస్తాం
అగరొత్తులను ముట్టిస్తాం
బొమ్మల కొలువు పెట్టిస్తాం
హరి ఓం అని మేం రాస్తాం !

దేవుని గుడిని దర్శిస్తాం
గంటా నాదం చేస్తాం
డబ్బులు హుండిల వేస్తాం
తనివి తీరా మొక్కేస్తాం !

అక్షర లక్షలు రాసి
దేవీ పల్లకిని మోసి
శోభాయాత్రను చూసి
వస్తుందిలే మా మానసి !

మా దసరా వైభోగం
దశ దినాల అనురాగం
ఎగిరేటి మన విహంగం
ముగిస్తున్న ప్రసంగం. !


గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments