ముత్యాల హారాల దీపావళి
------------&&&&&--------------
వచ్చానుగా వచ్చే మన
ఘన దీపావళి వచ్చే
ఆనందాలను ఇచ్చే
ఇక జనమంతా మెచ్చే !
ప్రమిదల పండుగ ఇది
ఆనందించు మన మది
వసంతాన్ని తెస్తుంది
సంతోషాన్నిస్తోంది. !
సత్యభామ దీపావళి
నిత్యభాను రూపావళి
శచీదేవి శోభావళి
అసుర హతం తిమిరావళి !
వెండి వెలుగుల పండుగ
నిండు పున్నమి ఉండగ
వస్తున్నది మస్తున్నది
ముదమును కలిగిస్తున్నది !
టపాసులు కాల్చవద్దు
పటాటోపం చూపొద్దు
జ్యోతుల వెలిగిస్తే ముద్దు
మనందరి కష్టాలు రద్దు !
వెలిగిపోవు ఈ దీపావళి
తొలగిపోవు పాపావళి
తెలుగువారి రూపావలి
మేలిమైన కృపావళి. !
ఘన ముత్యాల దీపావళి
మన పగడాల రత్నావళి
జానపదం గీతావళి
జనహృదయం బకావళి. !
వెలుగులనూ మెరిపిస్తూ
చూపులతో మురిపిస్తూ
బంధాల ముడివేస్తూ
కలలను నిజం చేస్తూ!
వస్తున్నది దీపావళి
గతించేను తిమిరావళి
నీకు తెలిసిందా రవళి
ఇక వాయించు నీ మురళి !
నరకాసురుని వధవల్ల
వచ్చే దీపావళి మల్ల
ఆయె తిమిరావలి గుల్ల
మురిసే ముల్లోకాలెల్ల !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.