దైవ వివాహం (చిట్టి కథ). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత, బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

దైవ వివాహం (చిట్టి కథ). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత, బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

దైవ వివాహం (చిట్టి కథ)
++++++++++++++++++
పూర్వం పాంచాల దేశాన్ని పౌరసీలుడు అనే రాజు పాలించేవాడు. అతని భార్య పేరు మిత్రవింద. వీరి వివాహం జరిగి చాలా కాలం అయినప్పటికీ సంతానం కలగనందున కుల గురువు చెప్పిన విధంగా తన రాజ్యాన్ని మంత్రిమహేంద్రవర్మకు అప్పజెప్పి అడవి కెల్లి గోదావరి తీరంలో బ్రహ్మ దేవుని గూర్చి తపము ఆచరించ సాగాడు. ఒకనాడు ఆ గోదావరి నదిలో స్నాన మాచరించుటకు వచ్చిన బృగుడను ఋషి తపం చేస్తున్నా రాజును చూసి "ఓ రాజా! నీవు తపస్సు చేయుటకు కారణమేమి? అన్ని ప్రశ్నించగా అందుకు రాజు"మునీశ్వరా! నాకు సంతానం లేని కారణంగా సంతానంకై నేను ఈ తపస్సు ప్రారంభించాఅని చెప్పాడు. అప్పుడు ముని వేషంలో ఉన్న బ్రహ్మ"రాజా! నీవు ఈ ఘోర తపస్సును సాగిస్తూ కూర్చన్నావే తప్ప నీ ముందు ప్రత్యక్షంగా ప్రత్యక్షమై, నీ యోగక్షేమాలు అడుగుతున్నా ఈ బ్రాహ్మణే గుర్తించలేకపోతున్నావు. అనగానే రాజు కళ్ళు తెరిచి తన ఎదుట ఉన్న ఋషిని చూసి"ఏమని సెలవిస్తేరి ఋషి పొంగవా? నా దైవం బ్రహ్మ ప్రత్యక్షమయ్యారా! వేడి ? ఎక్కడ? అంటూ రాజు నలువైపులా చూడగా, నలువైపులా అతనికి ఋషిపుంగవుడేకనిపించాడు. వెంటనే రాజు బ్రహ్మ దేవుని లీలలను గుర్తించి తనకు సంతాన భాగ్యం కలిగించమని కోరాడు. తధాస్తు అంటూ ముని రూపంలో ఉన్న బ్రహ్మదేవుడు దీవించి అంతర్థానమయ్యాడు.
           బ్రహ్మ వర ప్రభావం వల్ల రాజు భార్యకు ఆడపిల్ల కలిగింది. ఆ అమ్మాయికి విధాత్రి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచసాగారు. అమ్మాయి యుక్త వయసుకు రావడం చే" రాజు భార్య మిత్రవింద" నాధా ! అమ్మాయి పెండ్లీడుకు వచ్చింది. ఓ మంచి వరుణ్ణి వెతికి వివాహం కావిద్ధం. అని కోరగా" అలాగే దేవి! ఈరోజు నుండే నేను వరాన్వేషణలో నిమగ్నం అవుతానని చెప్పాడు రాజు.
           పొరుగు రాజకుమారుడైన గుణశీలునకిచ్చి పెళ్లి చేయాలని తలంచి రాజు విధాత్రి జాతక చక్రం కులగురువుకు చూపించి జాతక ఫలం చెప్పమని కోరాడు. గురువు జాతక చక్రం పరిశీలించి "రాజా! మీ కుమార్తె జాతకంలో ఓ దోషం ఉంది. ఆ దోషం వల్ల నీవు ఈ పెళ్లి చేయలేవు అని అనగా". రాజు దీనా వదనంతో "అదేంటి గురువర్యా? బ్రహ్మ దేవుని వర ప్రభావంతో జన్మించిన నా బిడ్డకా దోషం అంటూ పరివేదన చెంది, అదేంటో సెలవివ్వమని కోరాడు. అప్పుడు నీ బిడ్డ వివాహం అయిన తక్షణం మీ అల్లుడు మరణిస్తాడు. కాన వివాహం మానుకోండి అని గురువు చెప్పాడు. ఇక అప్పటి నుండి రాజదంపతులు దుఃఖ భారాన్ని మోయలేక సతమతమౌతూనే, కూతురు పెళ్లి ఎలా చేయాలో అర్థం కాక ఉన్న పరిస్థితి గమనించిన మంత్రి "వారిని ఓదారుస్తూ! మహారాజా! బ్రహ్మ వరప్రసాదిని అయిన నీ కుమార్తెకు జాతక చక్రంలో దోషం ఉందంటే నేను నమ్మలేకపోతున్నా! ఒకవేళ ఉంటే, ఆ దోష నివారణ మార్గం కూడా ఉంటుంది గా, ఆ మార్గం ఏదో తెలుసుకొని ఆచరిస్తే సరిపోతుందిగా అనగానే" మహామంత్రి! ఆ దోష పరిహార నిమిత్తమై ఏం చేయాలని మరల కుల గురువును కోరగా రాజా! ఈ దోశ నివారణ చేయగల సత్తా కేవలం మహాతపసంపన్నుడైన అజాతశత్రు జిత్తుకే ఉందని చెప్పగా, వెంటనే అజాతశత్రువుని కలిసేందుకు ఏర్పాట్లు చేయమని మహామంత్రిని ఆదేశించాడు రాజు.
         ఓ శుభ ముహూర్తాన రాజదంపతులు అజాతశత్రుజిత్తు మహా మునిని కలుసుకొని, దోష పరిహార మార్గం తెలుసుకున్నారు. వరుడైన గుణశీలుని ప్రతిమను తయారు చేయించి విధాత్రితో పెండ్లిగాయించారు. పెళ్లి తంతు ముగిసిన వెంటనే గుణశీలుని ప్రతిమ వెయ్యి ముక్కలయ్యింది. ఈ హఠాత్ పరిణామానికి విధాత్రి మతి తప్పి కింద పడిపోయింది. అలాగే రాజమందిరం ప్రక్క గదిలో నున్న గుణశీలునికి శరీరమంతా గాయాలైనాయి. దోషం తప్పిపోయి కుమార్తె వివాహం ఏ విఘాతం లేకుండా జరుగుతుందనుకున్న రాజు భద్రతప్పి పడిపోయిన బిడ్డను, గాయాల పాలైన అల్లున్నీ చూసి భరించలేక"ఓ బ్రహ్మదేవా! నీవు ప్రసాదించిన బిడ్డను, ఆమె భర్తను గాయాల పాలు చేసి మమ్ముల ఎందుకింత బాధ పెడుతున్నావ్? ఈ బాధ భరించలేం? మేము నీ సన్నిధిలోకి వస్తున్నా అంటూ రాజుగారు తన కరవాలంతో తన తల నరుక్కునపోగా, బ్రహ్మ వెంటనే ప్రత్యక్షమై,"రాజా! ఈ సాహసానికి, నీ భక్తికి, నీ బిడ్డ పై గల అనురాగానికి మెచ్చాను లే. అనగానే, రాజకుమార్తె స్పృహ నుండి మేల్కొని లేచింది. గాయాల మాయమైన అల్లుడు గుణశీలుడు కూడా గాయాలు మాయమై కోలుకున్నాడు. అందరూ ఒకరిని ఒకరు చూసుకుని అంతా ఏకమై భక్తి ప్రమత్తులతో బ్రహ్మదేవుని కొలిచారు. బ్రహ్మ దేవుని  సమక్షంలోనేవిధాత్రి గుణ శీనుల వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments