Pravahini

నేడే ఏ పి.జె అబ్దులకలాం జయంతి...ఆయన అడుగుజాడల్లో యువత కొనసాగలి: కవి లెక్చరర్ వైద్య.శేషారావు
కామారెడ్డి జిల్లా దోమకొండ
అక్టోబర్14,(ప్రజా జ్యోతి) 
 ఆయన ప్రతి అడుగు ఆలోచన భారత దేశాన్ని  2020 వరకు అన్ని రంగాలలో  అభివృద్ధిని ఆకాంక్షించారు మరియు ప్రయత్నించారు.అది  నిజం అయిందా అంటే కొంత సందేహం తప్పదు
      అవుల్ పకీర్ జైనులొద్దిన్ అబ్దుల్ కలామ్. ఆయన ఒక పడవ నడిపే తండ్రి, తల్లి సాధారణ పేద ఉమ్మడి కుటుంబం లో పుట్టి తండ్రి కి సహాయంగా పేపర్ బాయ్ గా పనిచేసిన కష్ట జీవి
    తల్లి తను చిన్న కొడుకు చదువు కోవడం తో కొంచం ఎక్కువ అన్నం పెట్టేది.మొదట్లో  తిరుచిరా పల్లి లో ఎం.ఎస్సి ఫిసిక్స్ పూర్తి చేసిన ఒక సంతృప్తి లేదు.మద్రాస్ యూనివర్సిటీ లో ఏరో నాటికల్ స్పేస్ ఇంజీ నీర్ పూర్తి చేసినారు
     ఇస్రో లో శాస్త్ర వేత్తగా చేరి అనేక పరిశోధనలకు ఆద్యుడు గా మరినారు.  పి.ఎస్.ల్.వి,ఎస్.ఎల్.వి 3 లాంటి స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణుల తయారీ లో కీలక పాత్ర వహించారు.1998 లో పోక్రన్ అణు పరీక్షల నిర్వహణలో బాగస్తుడు అయ్యి అణ్వయుధ లు కల్గిన  దేశాల స్థానంలో నిల్పినరు
ది హిస్టరీ ఛానెల్ మరియు  జియో ఛానెల్ వారు నిర్వహించిన దానిలో 2 వ స్థానంలో ఉంది.
  ఆయన ముస్లిం గా ఖురాన్ ఎంత చదివేవారో భగవత్ గీత అంతే చదివే వారు.పరమత సాహనం  తోపాటు మానవత్వం మెండు గల వాడు 11 వ రాష్ట్రపతిగా 90 శాతం పైగా మెజారిటీ తో ఎన్నికయ్యారు పూర్తి స్థాయిలో కర్తవ్యానిర్వహన తో పనిచేసి  వ్యక్తి భారత దేశం లో ఏ ఒక్క వ్యక్తి వ్యతిరేకించని వ్యక్తిత్వం అతని ది.ముస్లిం పద్ధతి ప్రకారం వివాహం చేసుకోక పోవడం తప్పు కానీ జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నారు ఆయన శకాహారి
ఒక లక్ష మంది విద్యార్థుల తో సంభాషించాలని లక్ష్యం తో పనిచేసినడు బోధన వృత్తి అంటే ఎంతో ఇష్టం రాష్ట్రపతి తర్వాత ఎన్నో విశ్వవిద్యాలయళ్లలో వివిధ అంశాలపై మాట్లాడి నాడు
40 విశ్వవిద్యాలయల నుండి 7 గౌరవ డాక్టరేట్స్, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో పాటు భారత రత్న కూడా అందుకున్నారు.ఇవన్నీ ఒకే ఎత్తు కేవలం ఒక డ్రెస్ ,లాప్ టాప్ ,గ్రంథాలు తప్ప ఏమీ ఉంచుకోలేదు.ఎన్నో అద్భుతమైన పుస్తకాలు రాసినరు.2015 జులై 27 నాడు షిల్లాంగ్ లో ఐ.ఐ.ఎం లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కుప్పకూలినడు. కలలు కనండి,వాటి ని చేరడానికి ప్రయత్నించండి.ఆయన లాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న  భారతదేశం చేసుకున్న పుణ్య ఫలం.ఆయన ఆశయాలు సాధనకు నిబద్ధతతో కూడిన  యువత తో సాధ్యం అప్పుడే అతనికి నిజమైన జయంతి మరియు నివాళి

0/Post a Comment/Comments