సత్యాల సరాలు
----------------------------------------
మంచి విరియని హృదయము
వాసన లేని పుష్పము
చమురు లేని దీపము
నీరులేని జలాశయము
నవ్వు కురియని వదనము
వీగిపోయే మేఘము
శిథిలావస్థ భవనము
త్రాణ లేని కాయము
మేలి చేయని బ్రతుకులు
ఎండిపోయిన ఆకులు
సాయపడని చేతులు
నీటి మీద రాతలు
శాంతిలేని మనసులు
కాంతిలేని ప్రమిదలు
ఆచరణ లేని మాటలు
సారం లేని పొలములు
-గద్వాల సోమన్న,
ఎమ్మిగనూరు.