బాణాలు పేల్చునపుడు
జాగ్రత్తలు
-----------------------
దీపావళి వేడుక
పంచుతుంది మోదము
బాణాలు కాల్చు వేళ
జాగ్రత్త లేక ఖేదము
పెద్దల సాయంతో
కాల్చాలోయ్ టపాసులు
తగు జాగ్రత్తలతో
ఉండాలోయ్ పిల్లలు
బాణాల రవ్వలతో
కళ్ళకు హానికరము
సూచనలు పాటిస్తే
ఎంతైనా క్షేమము
వద్దోయ్ నిర్లక్ష్యము
దీపావళి రోజున
అతి చిన్న తప్పిదము
పెను ముప్పు బ్రతుకున
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు .