వెన్నముద్దలా బతుకమ్మ(ఎనిమిదవ రోజు)శ్రీలతరమేశ్ గోస్కుల.

వెన్నముద్దలా బతుకమ్మ(ఎనిమిదవ రోజు)శ్రీలతరమేశ్ గోస్కుల.


శివుని ముద్దుల గుమ్మ
తీరొక్క పూల అలంకరణలతో
మురిసి ముగ్ధ అవుతుంటే..

తంగేడు గునుగు చామంతి 
గులాబీ గడ్డి పూలతో
ఎనిమిదంతరాలు
నిత్య నూతన పరిమళాలతో
విశ్వమంతా సుగంధాలు 
వెదజల్లగా...

బతుకునిచ్చేటి బతుకమ్మ తల్లి
తెలంగాణలో పుట్టి లోకమంతా తిరిగి మా....
ఇంటింటా ఇలవేల్పై పూజలందుకుంటూ...

అంజన్న ఆలయం వద్ద
ఇద్దరక్క చెళ్ళెల్లు ఉయ్యాలో...
ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో...
ఒక్కడే మాయన్న ఉయ్యాలో...
వచ్చన్న పోడాయే ఉయ్యాలో్...
చూసన్న పోడాయే ఉయ్యాలో....
అంటూ
ఆటపాటల నడుమా..
జయజయ హారతులు పట్టి
సంబరాలు చేసిన బతుకమ్మలతో
ఊరచెరువు కళకళలాడే...

నేతి కలిసిన సత్తు ముద్దలకు తోడుగా..
బెల్లంతో కలిపిన నువ్వుల ఉండలు పలారంగా జూపుతు
వాయనాలతో ఇంతుల మోము
కిలకిలలాడే...

*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*

0/Post a Comment/Comments