విజయదశిమి

విజయదశిమి

నేడే విజయదశమి..పాల పిట్టను ఎందుకు చూస్తారు వివరించిన కవి,లెక్చరర్ వైద్యశేషారావు

భారత దేశంలో మైసూర్,ఈశాన్య భారతంలో మరియు తెలుగు రాష్ట్రాల లో విజయదశమి (దసరా) ఘనంగా జరుపుకుంటారు దాని వెనుక ఉన్న కథను మనం గమనిద్దాం.
*దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది.  *'శ్రవణా'* నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి *'విజయా'* అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి , వారము , తారాబలము , గ్రహబలము , ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. *'చతుర్వర్గ చింతామణి'* అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము అని గమనించలి

*'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుూపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు.*

*శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి , రావణుని సహరించి , విజయము పొందినాడు.*

*తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట' ను చూచే ఆచారం కూడా ఉన్నది.*

*ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని , విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి,          ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.*

*శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |*

*అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||*

*పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి .తెలంగాణలో పాలపిట్టను చూసి జమ్మి వృక్షానికి పూజ చేస్తారు.కొన్ని గ్రామాల్లో కొందరి ఇండ్ల ముందు గుమ్మడి కాయలు కొన్ని ప్రాంతాలల్లో మేకలు గొర్లను బలి ఇవ్వడం ఆనవాయితి.డప్పు చప్పట్లతో ఊరు పెద్ద అద్వర్యం లో పాల పిట్ట దర్శనానికి వెళ్ళి అది కనిపించ గానే పాల పాల అంటూ చప్పట్లతో ఆనందాన్ని పంచుకొని పరస్పరం ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
.          రేపటి తరానికి మన సంస్కృతీ  సంప్రదాయాలు అందిద్దాం

0/Post a Comment/Comments