నేడే సద్దుల బతుకమ్మ

నేడే సద్దుల బతుకమ్మ

నేడే సద్దుల బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించిన కవి,లెక్చరర్ వైద్య.శేషారావు
లింగాపూర్, కామారెడ్డి
బతుకమ్మ పండుగ తెలంగాణకే పరిమితమైన ప్రకృతి పండుగ.ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు జరుపుకుంటారు.తెలంగాణ ఉద్యమంలో దీని ప్రాధాన్యత పెరిగి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం.
     పువ్వులనే పూజించే విధానం ఈ పండుగ విశిష్టత.గత వెయ్యి సంత్సరా ల నుండి బతుకమ్మ ను గౌరిగా పూజిస్తున్నారు తెలంగాణ ప్రజలు.వర్షాకాలం చివరలో శీ త కాలం ప్రారంభలో వస్తుంది దసరా కు ఒక్కటి రెండు రోజుల తేడాలో వస్తుంది.
    తెలంగాణ ఉద్యమంలో ఒక ఉత్తేజం కల్గించి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించింది.నేడు విదేశాల్లో సైతం ఆడుతున్నారు విమల అక్క వామపక్ష భావజాల0 ఉన్నవారు బడుగుల బతుకమ్మ ప్రాచుర్యంలోకి తెచ్చారు.ఒక్కప్పుడు రెడ్డిల బతుకమ్మ, కాపుల బతుకమ్మ ,కుర్మోళ్ల బతుకమ్మ అంటూ కులాల వారిగా ఉండేవి. కొన్ని కులాలు వారు ఎస్.సి ఎస్.టి లు ఆడవారు కాదు.నేటి ఉద్యమ ఫలితంగా వారి వారి అస్తిత్వపు గీటు రాయిగా మరి బతుకమ్మ అందరి పండుగ అయింది
    ఈ పండుగకు రెండు కథలు ప్రాచుర్యం లో ఉన్నాయి బట్టు రాజు చోళ దేశాన్ని పారిపాలించే వారు అందులో ధర్మంతో కూడిన వాడు.ఒక యుద్ధంలో అన్నికోల్పోయి భార్య సత్యవతి తో అడవులకు వెళ్లినడు.మహాలక్ష్మిని తపస్సుతో మెప్పించెను.అప్పుడు సాక్షిత్కరించిన లక్షిమి నీకు ఏమి వరం కావాలని కోరింది.నీవే నా గర్భం లో జనించాలని కోరగా సమ్మతించి తదస్తూ అని ఆరోగ్యం గా బతుకమ్మ అని దివించింది. బతుకు మ్మ గా పిలుచుకొని తిరిగి వారి రాజ్యాన్ని పొంది ఆనందంగా జీవించారు
     క్రీస్తు శకం 997 వేముల వాడ చాళుక్యులు పారిపాలించే వారు. వారు వేములవాడ రాజరాజేశ్వరుణ్ణి బాగా ఆరాధించే వారు ఆపదలో ఉన్నప్పుడు వారు రాజేశ్వరి మాతను ప్రార్థించే వారు .స్వయంగా క్రీస్తు శకం 1006 బారి శివలింగాన్ని ప్రతిష్టించారు
     నిజాం నవాబుల దురగతలను జానపదుల రూపంలో స్త్రీలు పాడుకునే వారు. తమ శ్రమ ను హక్కులను లిపి లేని పాటలు జనపధాల రూపంలో పాడుకునే వారు.
    తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ చీరల పంపిణీ,తెలంగాణ జాగృతి ద్వారా కవిత అద్వర్యం లో విశ్వవ్యాప్తితం అయ్యింది.ఈ పండుగ నేడు పోట పోటీగా జరుపుకుంటున్నారు.
     ఆ రోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే నేడు బతుకమ్మ ఆడే తీరే మారింది.డి.జె పాటలకు అనుగుణంగా విభిన్న స్టెప్పుల తో ఆడుతున్నారు.
    చింతపండు పులుపు సద్ది,కరియలు,కొబ్బరి సద్ది వీలును బట్టి 5 రకాల సద్దులు చేస్తారు.అష్టమి రోజు గ్రామ కూడలిలో పేర్చి ఊర్లో డప్పు చప్పట్లతో బతుకమ్మలు ఒకదగ్గర పెట్టి ఆడి గ్రామ చెరువులో నిమజ్జనం చేసి ముత్తైదువులు ఒక్కరు వాయినాలు ఇచ్చుకుంటారు. పెళ్లి అయినఆడపిల్లలను ఇంటికి అతితులుగా పిలుచుకొని చీర సారె పెడతారు.
ఒక అస్తిత్వ ప్రతికై ప్రకృతి ఎన్నో ఇచ్చింది తిరిగి దానికే ఇవ్వాలి అనే స్పృహను బతుకమ్మ తెలుపుతుంది.బతుకు నేర్పే అమ్మ బతుకమ్మ.రేపటి తారనికి జాగ్రత్తగా నేర్పుదాం
ఆరోగ్య, ఐశ్వర్య,ఉద్యమ, సంస్కృతి నేపథ్య0 గల బతుకమ్మ సాంఘిక అసమానతలకు దూరంగా సమాజాన్ని ఏకత్వానికి తెచ్చింది అనేదానిలో సందేహం లేదు
 ఉమశేషారావు వైద్య
లెక్చరర్ జి.జె.సి దోమకొండ
కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments