కవి గద్వాల సోమన్నకు అనంతలో సన్మానం-ప్రవాహిని న్యూస్

కవి గద్వాల సోమన్నకు అనంతలో సన్మానం-ప్రవాహిని న్యూస్

కవి గద్వాల సోమన్నకు అనంతలో సన్మానం
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నకు ప్రెస్ క్లబ్,అనంతపురంలో ఘనంగా సన్మానం జరిగింది. అచిరకాలంలో, బాలసాహిత్యంలో 24 పుస్తకాలు రచించడమే కాకుండా పిల్లలచే రచింపజేసి పుస్తకాలు వేసినందుకు, ఎనలేని తెలుగు భాషా సేవలకు గానూ తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ,అనంతపురం, అధ్యక్షులు టి.వి.రెడ్డి,విశ్రాంత రాష్ట్రపతి భవన్ ఉద్యోగి లక్ష్మీనారాయణ,హెచ్.యం స్వామి మరియు విచ్చేసిన ప్రముఖులచే ప్రశంసా పత్రం,మెమొంటో ఇచ్చి, శాలువా కప్పి కవి సోమన్నను సత్కరించారు.సన్మాన గ్రహీతను ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు శ్రేయోభిలాషులు అభినందించారు.

0/Post a Comment/Comments