సలామ్ సలామ్

సలామ్ సలామ్

భీం
పౌరుషం లో మేరు మగధీరుడు
బలం లో భీముడు
యుద్ధం లో అర్జనుడు
ఆదిలాబాద్ అడవి బిడ్డ
తెలంగాణ అల్లూరి
భారతంలో అభిమన్యుడు
ఆదివాసీల ముద్దు బిడ్డ
నిజాం పై తిరుగబడ్డ పులి బిడ్డ
పశువుల కాపర్లపై విధించిన
సుంకనికి ఎదురు తిరిగి
నిరసన గళం విప్పి
పిడికిలి బిగించి
అధివాసులను చైతన్య
స్రవంతిలోకి తీసుకవచ్చిన
భగత్ సింగ్
అడవి నాది గట్టు నాది
చెట్టు నాది పుట్ట నాది
నీవు ఎవ్వడివిరా అని
బ్రిటిష్ వారి పై తిరుగుబాటు
చేసిన క్రోధం నిండిన
సింహం అతను
జల్ జమీన్ జంగల్
అనే నినాదం ఇచ్చి
దాని సాధనలో
నిజాం రక్కసుల చేతుల్లో
ప్రాణాలు వదిలిన ధీరుడు
అది వాసి సూర్యుడు
మన తెలంగాణ కొమరం భీం
నీ స్ఫూర్తి మండే గోళం
ఖగోళం లోని నిప్పు కణిక వు
నా సలామ్ నీకు మా అందరి
సలామ్ అడవి బిడ్డల
ఆత్మీయబందువు నీవు
నీకు ఇదే మా లాల్ సలామ్
  ఉమశేషారావు వైద్య
  లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments