బాలల దినోత్సవం - నవంబర్ 14న ఎందుకు?

బాలల దినోత్సవం - నవంబర్ 14న ఎందుకు?

 బాలల దినోత్సవం - నవంబర్ 14న ఎందుకు?

  బాలల హక్కుల ప్రచారం కొరకు ప్రపంచమంతా బాలల దినోత్సవం జరుపుకొంటోంది. వివిధ దేశాలు వాటి ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి ఆయా తేదీల్లో బాలల దినోత్సవం జరుపుకుంటున్నాయి. అలాగే భారత దేశంలో కూడా నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుతున్నారు. నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం ఎందుకు జరుపుతున్నారు? అనే విషయాన్ని పరిశీలించాలి. ఈ సందర్భంగా చర్చించాలంటే ముందు భాతరదేశ మొదటి ప్రధాన మంత్రి (ప్రధాన మంత్రి) స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే నవంబర్ 14 నెహ్రూ పుట్టినరోజు. నెహ్రూ పుట్టినరోజును భారతదేశంలో బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.


  1947 - అది బ్రిటిష్ వాళ్ళు భారత్ కు స్వాతంత్ర్యం ప్రకటించి భారత్ ను వదిలి వెళ్ళే సమయం. అప్పుడు భారత జాతీయ ఉద్యమంలో అత్యంత చురుకుగా వ్యవహరించిన భారత జాతీయ కాంగ్రెస్ (Idian National Congress)కు నెహ్రూ అధ్యక్షుడిగా వున్నాడు. స్వాతంత్ర్య ప్రకటన అనంతరం జరిగిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచించబడ్డ భారత రాజ్యాంగం (Indian Constitution)ప్రకారం ఎన్నికలు నిర్వహించబడ్డాయి. తదనంతరం భారత దేశానికి మొదటి ప్రధానిగా నెహ్రూ ఎన్నిక కాబడ్డాడు. మరి నెహ్రూ బాలల కోసం ఏం చేశాడు? ఎందుకు తన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు? ఈ కోవలో మనం నెహ్రూ గురించి కొంత చర్చించుకోవడం అవసరం.


   జవహర్ లాల్ నెహ్రూ నవంబర్14, 1889న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించాడు. తండ్రి మోతీలాల్ సంపన్నుడైన బారిష్టర్ (న్యాయవాది). వీరు కాశ్మీర్‌కు చెందినవారు. వీరి పూర్వీకులు ఢిల్లీ వచ్చి స్థిరపడి మొఘల్ పాలకుల ఆదరాభిమానాలతో ఆర్థికంగా ఎంతో లాభపడ్డారు. మోతీలాల్ రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా వున్నాడు. తన మొదటి భార్య బిడ్డతో సహా పురిటిలోనే చనిపోగా రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు స్వరూపారాణి. స్వరూపారాణి మోతీలాల్ దంపతులకు తొలిసంతానం నెహ్రూ.


   వారసత్వ రాజకీయాలకు తెరతీసింది కూడా నెహ్రూ అనే చెప్పాలి. తన తండ్రి మోతీలాల్ నెహ్రూ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడయ్యాడు. సంపన్నులు రాజకీయాల్లోకి రావడం. ఈరోజు కొత్తేమీకాదు. అది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏర్పడ్డ తొలి ప్రజాస్వామ్య ప్రభుత్వంతోనే మొదలయ్యింది. ఉదాహరణకు జవహర్ లాల్ నెహ్రూ భారత్ కు మొదటి ప్రధాని అవడం. అత్యంత సంపన్న వర్గానికి చెందిన నెహ్రూ కుటుంబం 1905లో తన చదువుకోసమే బ్రిటన్ వెళ్లారు. స్కూల్, కాలేజీ విద్యల్లో అంతగా రాణించకున్నా... న్యాయవాద వృత్తిలో పేరు గడించా... ప్రధానమంత్రి కాగలిగాడు. 


   బ్రిటన్ లోని ప్రఖ్యాత హెరో పాఠశాలలో అడ్మిషన్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ ట్రినిటీ కళాశాలలో చదవడం, ఇన్నర్ టెంపుల్ లో న్యాయ విద్యను అభ్యసించడం అనేవి ఎంతో అద్భుతమైన విషయాలు. చదువు అంతమాత్రమే... కానీ టెన్నిస్ ఆట, గుర్రపుస్వారీ, పందెపు పడవల జట్టులో ఆడడం వంటి వ్యాపకాలు, ఫాషన్లు అనుసరించడం, అప్పులు చేయడం, బ్రిటన్ పట్ల ప్రేమాభిమానాలు మరియు బ్రిటీష్ విలువలను 1912 ఆగస్టులో ఇండియా చేరాడు. తన సుదీర్ఘ జీవన ప్రయాణాన్ని 1964, మే27న ముగించారు.


  భారతదేశంలో అణగారిన వర్గాల ప్రజలు మనుషులుగా చూసింది కేవలం ఆంగ్లేయులే. అగ్రవర్ణ ఆధిపత్య భావజాలపు రాజ్యకాంక్షే స్వాతంత్ర్య సమరం అని చెప్పాలి. నూటికి తొంభై శాతం ప్రజలకు పాలకులతో పనిలేదు. కేవలం బానిసలే. పోరాటం చేసి రాజ్యాధికారం సంపాదించి పెట్టడానికి పావులుగా ఉపయోగపడ్డవారు అంటరాని వర్గాలవారే. అధికారం చేజిక్కాక తరతరాల భారత ప్రజలు వారిని ఎప్పుడూ మరిచిపోకుండా ప్రతితరం వారిని పూజించే విధంగా, వారిని పొగిడే విధంగా వారి ఆధిపత్యాన్ని అంగీకరించే విధంగా చేసుకునే కుట్రలో భాగంగా మనం జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం(ఉపాధ్యాయ దినోత్సవం), బాలల దినోత్సవం(బాలల దినోత్సవం). భారతదేశ భవిష్యత్తు రూపుదిద్దబడే విద్యాలయాల్లో ప్రజాసేవతో ప్రత్యక్షంగా అంతగా సంబంధంలేని ఇద్దరి పుట్టినరోజులను అతిపెద్దపండుగలుగా జరుపుకోవాల్సి వస్తుంది.వారు చేస్తున్న సేవను మెచ్చి దేశ ప్రజలు వారి జ్ఞాపకార్థంగా వారి పుట్టినరోజులను ఉత్సవాలుగా జరిపితే తప్పులేదు. 


  కొందరు అత్యుత్సాహంతో నెహ్రూ గారికి పిల్లలంటే ఎంతో ఇష్టం. వారికోసం ఎంతో సేవచేశాడు. అని వారిని పొగడడం మాత్రమే పనిగా పెట్టుకుంటారు. ఎన్నో చారిత్రక సత్యాల్ని తుంగలోతొక్కి భావిభారత పౌరులకు తప్పుడు చేరవేస్తూ నేటికీ అగ్రవర్ణ ఆధిపత్యానికి అడుగులకు మడుగులొత్తుతూ పబ్బం గడుపుతున్నారు. ఒక బాలల దినోత్సవం కోసం రాస్తూ ఏమంటారంటే… నెహ్రూ మరణాంతరం పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమకు ప్రతీకగా తన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరపాలని పార్లమెంట్ చట్టం చేసింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం నెహ్రూ పుట్టినరోజైన నవంబర్ 14న బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అని పచ్చి అబద్దాన్ని పసి మనసుల్లో చొప్పిస్తున్నారు.


  స్వాతంత్ర్యానంతరం తను చనిపోయే వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా కొనసాగిన నెహ్రూ గారు తన 58వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని 1957లో తన పుట్టినరోజును బాలోత్సవంగా జరుపుకోవాలని శాసనం చేశారు. ఈ తంతు అప్పటినుండే అంటే నెహ్రూ చనిపోవడానికి సుమారు ఏడు సంవత్సరాల ముందే మొదలయ్యింది. ఈ విషయం డిసెంబర్ 1, 1957 ఇండియా న్యూస్ (INDIA NEWS)లో తాటికాయంత అక్షరాలతో ఛాయాచిత్రంతో సహా ముద్రితమయ్యింది. ఈ సందర్భంగా నెహ్రూ గారు మూడు తపాలా బిళ్ళలు(పోస్టల్ స్టాంపులు)కూడా విడుదల చేసారు.


   1924లో 'లీగ్ ఆఫ్ నేషన్స్' బాలల హక్కులపై జెనీవా డిక్లరేషన్‌ ఆమోదించబడింది. ఈ విధంగా ఆధునిక చరిత్రలో మొట్టమొదటిసారిగా బాలల హక్కులకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. దీన్ని 'సేవ్ ది చిల్డ్రన్' ఫండ్‌ను స్థాపించిన ఎగ్లాంటైన్ జెబ్ రూపొందించారు. ఆతరువాత ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ - UNICEF (అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి) 1946లో స్థాపించబడింది. 1948లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ - UNGA) ఆమోదించిన విశ్వమానవ హక్కుల ప్రకటన (యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్) లో తల్లులు మరియు పిల్లల గురించి ప్రస్తావించబడింది. 1959లో UNGA పిల్లల హక్కుల ప్రకటనను ఆమోదించింది. 1979 సంవత్సరాన్ని UNGA అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ప్రకటించింది. ఆతరువాత పది సంవత్సరాలకు 1989లో, పిల్లల హక్కులపై ఐక్యరాజ్యసమితి సమావేశం - UNCRC ఆమోదించబడింది. CRC 1990లో అమల్లోకి వచ్చింది. 2015 నాటికి, అమెరికా మినహా సభ్యులందరూ సమావేశాన్ని ఆమోదించారు. 1992 డిసెంబర్ 11న భారత ప్రభుత్వం కూడా CRC ని ఆమోదించింది.


   1956 నుంచి ప్రపంచ బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించాలని 1954 డిసెంబరు 14న ఐరాస జనరల్ అసెంబ్లీ అన్ని దేశా లకూ సిఫార్సు చేసింది. ప్రతి ఈ సందర్భం కోసం ఒక తేదీని దేశం ఖరారు చేయాలని సూచించింది. చాలా దేశాలు ఈ సూచనను గౌరవించి నవంబరు 20ని ప్రపంచ బాలల దినంగా పాటిస్తున్నారు. 1959 నవంబరు 20న ఐక్య రాజ్య సమితి(ఐరాస) జనరల్ అసెంబ్లీ బాలల హక్కుల ప్రకటనను ఆమోదించింది. 1989 నవంబరు 20న బాలల హక్కుల పై కన్వెన్షన్ ఆమోదించింది. అప్పటి నుండి నవంబర్ 20న అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంగా జరుపుకొంటారు.


    1956 నుండి ప్రతీ సంవత్సరం ఏదో ఒకరోజును బాలల దినోత్సవంగా నిర్వహించాలి అన్న ఐక్యరాజ్య సమితి సూచనతో మన దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1957లో ప్రత్యేక శాసనం ద్వారా తన పుట్టినరోజైన నవంబర్14ను బాలల దినోత్సవంగా మార్చారు. నిరంతరం రాజకీయాల్లో మునిగితేలే నెహ్రూ గారికి పిల్లలతో ఆనందంగా గడిపే సమయమే ఉండేది కాదు, కానీ కొన్ని కార్యక్రమాల్లో భాగంగా పిల్లలను కలిసే ఏర్పాటు చేస్తే బహిరంగ కార్యక్రమాల టీవీ కెమెరాల ముందు నటించేవాడని ప్రముఖ ఆంగ్ల రచయిత క్రోకర్ తెలియజేశాడు.


   భారతదేశంలో బాలల సంరక్షణ కోసం నిధి సేకరణ చేయడం 1951లోనే మొదలయ్యింది. 1951లో యునైటెడ్ నేషన్స్ సోషల్ వెల్ఫేర్ ఫెలో అయిన వి.ఎం. కులకర్ణి బ్రిటన్‌లో నేరాలకు గురైన పిల్లల పునరావాసంపై ఎటువంటి అధ్యయనాలు జరుగుతున్నా భారతదేశంలో పిల్లల సంరక్షణ కొరకు వ్యవస్థ లేదని గ్రహించి, జూన్ 19న క్వీన్ ఎలిజబెత్ జన్మదినమైన జూన్ 19న పిల్లల సంరక్షణ కోసం పిల్లల సంరక్షణ కోసం డబ్బు సేకరించడం నుండి ప్రేరణ పొందింది, ఐక్యరాజ్య సమితికి ఒక నివేదిక అందజేస్తుంది. అందులో అతను భారతదేశంలో బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థల కోసం నిధులు సేకరించేందుకు నెహ్రూ పుట్టినరోజును ఫ్లాగ్ డే గా గుర్తించాలని కోరాడు. అప్పుడు ఐక్యరాజ్య సమితి నెహ్రూ సమ్మతి కోరగా మోహమాట పడుతూ అయిష్టంగానే ఒప్పుకున్నాడు. 


  సంపన్న వర్గాలు, వారసత్వ రాజకీయాలు, అగ్రవర్ణ భావజాలం కాసేపు పక్కనపెడితే... రాజకీయాలతో బాలల సంక్షేమాన్ని కోరుతూ ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ (ICCW)కు అధ్యక్షుడుగా పనిచేసి బాలల కోసం శ్రమించిన కులకర్ణి గారి జన్మదినం ఎందుకు బాలల దినోత్సవం కాలేదు. ఐక్యరాజ్య సమితి రూపొందించిన బాలల హక్కుల ఒప్పందంపై సంతకం చేసిన తేదీ ఎందుకు బాలల దినోత్సవానికి వేదిక కాలేదు. ఎందుకు కాలేదంటే అందుకు కారణం అగ్రవర్ణ ఆధిపత్యపు భావజాలమని చెప్పక తప్పదు.


- ఎం. రాజేందర్, ఎస్.ఏ. తెలుగు, 9010137504

0/Post a Comment/Comments