గురుదేవులు
(మధురిమలు)
-----------------------------------
జ్ఞానానికి మూలము
బడిలో గురుదేవులు
అజ్ఞానం దూరము
నేర్చిన అక్షరాలు
చూపుతారు మార్గము
జీవితాన గురువులు
తాకినచో పుణ్యము
వారి ఘన చరణములు
గురువు లేని చదువులు
రాతలు శూన్యంలో
నీతి లేని బ్రతుకులు
వ్యర్థమే జగతిలో
గురుదేవులు భువిలో
కనిపించే వేల్పులు
గౌరవించు హృదిలో
జరుగుతాయి శుభములు
-గద్వాల సోమన్న,
ఎమ్మిగనూరు.