నేటి బాలలే రేపటి పౌరులు

నేటి బాలలే రేపటి పౌరులు

పిల్లలు
చిరు నవ్వులు చిందిస్తూ
హృదయానికి హత్తకునేలా
ఇళ్ల0త సందడి చేస్తూ
లోపల  ఎది దాచుకోకుండా
దైవత్వం ఉట్టి పడేలా
రోజంతా చూస్తూ ఉండాలి
అనిపించేలా
ఎటువంటి బాధ కల్గిన
నవ్వుతూ ఉండాలని
అనిపిస్తుంది పిల్లలను చూస్తే
కానీ ఎంత.మంది ఆ సంతోషం
దక్కనిస్తున్నరు?
చింపురు జుట్టు
మాసిన బట్టలు
బుక్కెడు బువ్వకు
అవ్వ అవ్వ కల్మొక్త
అంటూ వీధుల వెంబడి
కనపడే ధృష్యమా
బడి కి దూరం అయ్యి
బతుకు బండిని లాగుతున్న
నవ్వే కనిపించని బాలలు కొందరు
కన్వెంట్లు చదువుల్లో
లక్షల ఖరీదు చేసే బడుల్లో
కొందరు
పడేసిన మేతుకుల కొసం
ఊరు కుక్కల తో చెలగాటం తో
కొందరు
కరెన్సీ నోట్లు ఖరీదు బాబులా
పెట్ డాగ్ లు  అన్న నయం
వేదన చెందట్లేదా కొందరు పిల్లలు
ఇది ఎక్కడి న్యాయం
ఒబేసిటీ తో ఒక్కరు అయితే
పోషక ఆహార లోపం తో
ఒళ్లే లేని కొందరు
బువి నుండి నింగి వరకు
ఎంతో ప్రగతి
కానీ నేటి బాలురే రేపటి
పౌరులు ఏమిటి ఈ దుస్థితి
మార్పు ఇంకెన్నాళ్ళు
సమాజీక నేరప్రవృత్తి  కి
బాల్యం అనువాల్లు కారాదు
వారి భవిత మార్పు కోరే
సమాజం మీదే
ఆస్తికోసం పిల్లల్ని చంపుతున్నం
కామించే వాడు త్రుంచేస్తున్నడు నేడు
అక్రమ సంబంధానికి అడ్డుగా
వస్తున్నారు అని కన్నతల్లి
చంపుతూ ఉంటే
బాలల హక్కుల రంగుల
చట్రం లో కల గానే
మిగులాల?
ఉమా శేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్
9440408080

0/Post a Comment/Comments