తల్లిదండ్రులు వేల్పులు(మధురిమలు) -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు.

తల్లిదండ్రులు వేల్పులు(మధురిమలు) -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు.

తల్లిదండ్రులు వేల్పులు
(మధురిమలు)
-----------------------------------
కనిపించే వేల్పులు
కన్నవారు మహిలో
సాటిలేని  సేవలు
సేవించుము మదిలో

త్యాగానికి గురుతులు
తల్లిదండ్రులు  కదా
నీడనొసగు తరువులు
పూజించుము సదా

కన్నవారి పలుకులు
తేనె వోలె మధురము
మమకారపు  మూటలు
దిద్దునోయ్! జీవితము

కష్టబెట్టకూడదు
వారి దొడ్డ మనసులు
చులకన చేయరాదు
వారిచ్చిన బ్రతుకులు

-గద్వాల సోమన్న,
ఎమ్మిగనూరు. 

0/Post a Comment/Comments