ఓటు నీ ఆయుధం

ఓటు నీ ఆయుధం
ఓటు నీ ఆయుధం

అన్యాయం అక్రమాలు
జరుగవట్టె అంటున్నాం
దోపిడీలు,భూకబ్జాలు
చేయవట్టె అంటున్నాం

అక్రమాలు జరుగవద్దు
అన్యాయం చేయవద్దు
ఇవి ఆపాలన్నా,ప్రజలు బాగుడాలన్నా
నీకు నీవు రక్షించు కొనె
నీ దగ్గర ఉన్న ఆయుధమే
నీకు నిన్ను రక్షించును

నా దగ్గర ఉన్న ఆయుధమా
అని ఆలోచిస్తున్నావు కదా!!
అవును ఆలోచన వస్తుంది.
ఆయుధం  అవసరం
తెలుసుకోకుంటె నిజంగా 
అది మనకూ అందరికీ ముప్పె

ఎన్నికలే ఒక యుద్ధం 
ఆ ఆయుధమే నీ ఓటు 
వస్తున్నాయ్!వస్తున్నాయ్
ఎన్నికలొస్తున్నాయ్ వస్తున్నాయ్
లేవండీ లేవండీ మేల్కొనండి
సమయం అయింది ఆసన్నం

ఒక్కసారి తప్పటడుగు
జీవితాంతం నష్టపడు
ఇకనైనా ఓటేయుము
ఇప్పడిచ్చె డబ్బులు
ఎప్పడికీ సరిపోవు

నీ జీవితం నీ కుటుంబం
మనదేశం బాగుపరిచె నాయకుడెవరిని
ఒక్కసారి రెండు సార్లు
అది చాలకపోతే పది మార్లు 
పరిశీలన,ఆలోథన
మదిలోన తలచి తలచి 
మదికి మెచ్చిన వారెవ్వరో
చెప్పడు మాటలు వినకుండా
వారికే ఓటివ్వుము!!!!
ఇదే ఇదే నీ ఆయుధం!!!

పేరు:-తిరువాయిపేట లక్ష్మయ్య.
గ్రామం:-నానక్ నగర్ రంగారెడ్డి జిల్లా    చరవాణి:-9704038892

0/Post a Comment/Comments