రాజ్యాంగం అమలు

రాజ్యాంగం అమలు

నేడే రాజ్యాంగ దినోత్సవం.ఎందుకు జరుపుకుంటారు వివరించిన
సివిక్స్ లెక్చరర్ ఉమశేషారావు వైద్య

జాతీయ దినోత్సవం అ కూడా అంటారు.రాజ్యాంగ0  రాజ్యాంగ పరిషద్ చే ఆమోదించబడ్డ రోజు నవంబర్ 26,1949 సంత్సరం ఇది ఆమోదించబడి0ది. జనవరి 26,1950 లో అమల్లోకి వచ్చింది.
మోడీ ప్రభుత్వం 19,నవంబర్2015 న గెజిట్ నోటిఫికెషన్ ద్వారా నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది.11 అక్టోబర్ 2015 ముంబయి లోని బి.ఆర్.అంబేద్కర్ ఒక్క స్మారక విగ్రహానికి శంకుస్థాపన చేస్తూ భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ ప్రకటన చేసినారు 2021సంవత్సరం అంబేద్కర్ 131 వ జయంతి,రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీకి  అధ్యక్షత వహించి,రాజ్యాంగం ఒక్క ప్రాముఖ్యతను వ్యాప్తి చేయడానికి,అంబేద్కర్ ఆలోచనలు వ్యాప్తి చేసే ఉద్దేశ్యం తో నవంబర్ ను 26 ఎంచుకున్నారు.జాతీయ న్యాయ దినోత్సవం 2021 నవంబర్ 26 మోదీ ప్రసంగం మరియు లోకసభ స్పీకర్ కూడా కార్యక్రమంలో ప్రసంగించారు.
 దీనికి నేపథ్యం రాజ్యాంగ పీతమహుడిగా పిలువబడే అంబేద్కర్ (14ఏప్రిల్1891..6డిసెంబర్ 2015 )నాటికి అంబేద్కర్ జయంతి 125 వ జయంతి సందర్భం తో పాటు విద్యార్థులు, సామాన్య ప్రజలు రాజ్యాంగం విలువ తెలుపలని ఉద్దేశంతో దీన్ని అధికారికంగా ప్రకటించారు అప్పటినుండి న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.సంవిధాన్ దివస్, జాతీయ చట్ట దినోత్సవం పేర్లతోను వేడుకలను నిర్వహిస్తున్నాం
  భారత రాజ్యాంగం నవంబర్ 26  అమలు లోకి వచ్చి 73 సంత్సరాలు అవుతుంది.
    ఎన్నో ఆటుపోట్లు ఎదురైన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సామాన్యులు సైతం రాష్ట్రపతులు,ప్రధాన మంత్రులు అవ్వడం కాకుండా ప్రజా స్వేచ్ఛ కు లిఖిత పూర్వకంగా హక్కులు కల్పించిన రాజ్యాంగం. అనేక రక్షణలు కల్పించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్తద్వారా  అంతిమంగా ప్రజలే సార్వభౌములు అనే విధానం ప్రకటించింది.
   1976 సంత్సరం లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశిక లేదా పీఠిక  "భారత దేశ ప్రజల0 అయిన మేము భారత దేశ ప్రజల0 అయిన మేము భారతదేశాన్ని సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర  రాజ్యాంగ ఆమోదించు కున్న చట్టాన్ని అంగీకరిస్తున్నాం.
సమగ్ర స్వరూపాన్ని ఈ పీఠిక  విశిధికారిస్తుంది.కులనికో దేవుడు మతానికి ఒక గ్రంధం ఉంటుందేమో కానీ ప్రజలందరికీ వర్తించే రాజ్యాంగం బాధ్యతగా ప్రతి ఒక్కరు తెలుసు కోవాల్సి0దే. పీఠిక లోని అంశాలు బహుళ ప్రచారం లోకి తేవాలి.అది అందరి బాధ్యత.ఒక్కసారి మననం చేసుకోవాలి అంబేద్కర్ ఒక వర్గం వాడు కాదు దేశ ప్రజలందరి వాడు ఆయన ఏ లక్ష్యం కోసం ప్రపంచంలో నే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అందించారు. ఆయన ఆశయాలు అమలు జరిగితే చాలు బడుగు బలహీన ,వర్గాలకు న్యాయం జరుగుతుంది.
     130 కోట్ల జనాభా లో నేటికి కొందరు కనీస అవసరాలు కూడా తీరని ప్రజలు ఉండడం రాజ్యాంగం లోని లోపం కాదు కేవలం రాజ్యాంగ విలువలు తెలువని నాయకులు,పాలకులే కారణం.
అంబేద్కర్ అన్నట్లు  ఎంత చెడ్డ రాజ్యాంగం అయినప్పటికీ పారిపాలకులు మంచి వారు అయితే ఫలితాలు మంచిగా  ఉంటాయి.అదే చెడ్డవారు పారిపాలకులు అయితే ఎంత ఉత్తమ రాజ్యాంగం ఉన్న ఫలితాలు బిన్నంగా ఉంటాయి
విశేష పరిజ్ఞానం తో రాసిన రాజ్యాంగం మాత్రమే  నేటి సమస్యల పరిష్కారానికి మార్గం అరిస్టాటిల్ చెప్పిన మాట ఒక్కటీ గుర్తు చేసుకోక తప్పదు ఉత్తమ ప్రజలు  ఉత్తమ రాజ్యం నిర్మిస్తారు.చెడ్డ ప్రజలు చెడ్డ రాజ్యాంగాన్ని నిర్మిస్తారు.రాజ్యాంగం పట్ల అవగాహన  బాధ్యతగా తెలుసుకొని వాటి విలువల కు ప్రతి ఒక్కరు బాధ్యత ఉంటే
మంచి ఫలితాలు ఆశించవచ్చు.
ఉమాశేషారావు వైద్య
సివిక్స్ లెక్చరర్
జి.జె.సి.దోమకొండ
కామారెడ్డి

0/Post a Comment/Comments