'జీవ ప్రపంచం' పుస్తకావిష్కరణ
-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన 27వ, కొత్త పుస్తకం 'జీవ ప్రపంచం' బాలగేయాల సంకలనం మాజీ యం.ల్.ఎ శ్రీ యస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు గ్రంథాలయ చైర్మన్ శ్రీ సుభాష్ చంద్రబోస్,నిఖలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ అధ్యక్షులు శ్రీ మద్దులేటి,మైనారిటీ సంక్షేమ శాఖ అధ్యక్షులు శ్రీ మాబూబ్ భాష,సి.సి చర్చ్ పోస్టర్స్ రెవ. అనిల్ కుమార్, జీవన్ గారుల చేతుల మీద కోల్స్ మెమోరియల్ జూనియర్ కళాశాల, కర్నూలులో ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం అనతి కాలంలో 27పుస్తకాలు ప్రచురించడమే కాకుండా,బాలసాహిత్యంలో విశిష్ట సేవలకు గానూ గద్వాల సోమన్నను ఘనంగా సన్మానించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన యస్వీ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బాలసాహిత్యంలో గద్వాల సోమన్న సేవలు అమూల్యమని గొనియడారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీన్ గోవింద్ రెడ్డి,ఐ. టి.సి సేల్స్ మేనేజరు ఆర్వీ మోహన్ దంపతులు మరియు పురప్రముఖులు పాల్గొన్నారు.