*జాగ్రత్తలు మరువద్దు*(కైతికాలు)తాళ్ల సత్యనారాయణ

*జాగ్రత్తలు మరువద్దు*(కైతికాలు)తాళ్ల సత్యనారాయణ

కొత్తవేరియెంటుకు
అవకాశం ఇవ్వద్దు
అందుకు కావలసిన
జాగ్రత్తలు మరవద్దు
ఇబ్బందిపెడుతుంది
కొత్త మహామ్మరి

విదేశీ ప్రయాణాలు
అందాక మానాలి
విందులకు సభలకు
దూరంగా ఉండాలి
ఇండియాలో చేరింది
ఇబ్బందిపెడుతుంది

బహిరంగ ప్రదేశాల్లో
మాస్కులు తీయొద్దు
సామాజిక దూరం
పాటించుట మరవద్దు
నిర్లక్ష్యం చేయొద్దు
అరికట్టుట మరవద్దు

దగ్గు గొంతునొప్పి
జ్వరంలాంటివున్న
ఇబ్బంది కావచ్చు
నిర్లక్ష్యం చేస్తున్న
మాయదారి కరోనా
మరో రూపుతో వచ్చే

సబ్బుతో కడుక్కో
సానిటైజరు పూసుకో
ముఖానికి మాస్కు
తప్పకుండ పెట్టుకో
వ్యాక్సిన్ వేసుకోండి
శక్తిని పెంచుకోండి.

తాళ్ల సత్యనారాయణ
హుజురాబాద్.

0/Post a Comment/Comments