రైతు

రైతు

రైతు
ఆరుగాలం కష్టించి
నెల తల్లిని నమ్మి
మట్టిని ఊపిరిగా
చేసుకొని పంటలు పండించి
పెట్టేడు అన్నము పెట్టె రైతన్న
కు మిగులుతుంది సున్నం
అడుగు అడుగు న మోసాలు
కల్తీ విత్తనాలు,కల్తీపురుగుల మందులు
గిట్టు బాటు ధర లేక గట్టున ఏడుస్తుండు
చేను చెలకలు అమ్మి ఎడారి బాట పట్టి ఏజెంట్ మోసలతో
దిక్కులేని సావు సస్తుండు
కార్పొరేట్ల కు లేవు షరతులు
సవాలక్ష కండిషన్స్ రైతులకు
రుణాలు ఇవ్వడం లో
రైతు కూడా రాజీనామా చేస్తే
సృష్టి గమనం ఎటు
కిసాన్ దివాస్ కాదు నేడు దివాన్ అవుతున్నాడు రైతు
ఎవ్వడు రైతు వృత్తి వద్దు
అంటూ నిరుత్సాహపరుస్తూ
ఉంటే ఆహారపు కొరత
ఆహ్వానం పలుకుతుంది
ఇతోపియా, రువండా, సోమాలియా లు తయారు
అవుతాయి
రైతు క్షేత్రాలు ఆత్మహత్య కేంద్రాలు అయ్యి
పంటకు కీడుచేసే క్రిమిసంహకాలే ప్రీతి అయ్యి
మరణాలు నిత్యకృత్యాలై
ఆత్మలు ఘోషిస్తూ న్నాయి
వ్యవసాయం ప్రకృతి లో
ప్రతి ప్రాణికి సాయం చేసే
హృదయం 
రియల్ దందా లో రైతు భూములు పోయి
పలేర్లుగా మారుస్తున్న నేటి
రియల్ ఎస్టేట్ భూతం
ప్రకృతికి శాపం
అందుకే ఒక్క రోజు కాదు
రోజు రైతును గౌరవిద్దాం
రైతుకు ఇచ్చే సాహయం పై
ఆంక్షలు వద్దు
వారిని ఓట్ల రాజకీయాల్లో
చదరంగం పావులను చేయవద్దు
ఆర్ధిక శక్తులు ఎదిగే విదంగా
ప్రోత్సహిద్దాం
మన తరం కాదు రేపటి తరానికి వ్యవసాయం ఒక
వృత్తిగా గర్వాంగా కొనసాగిద్దాం
జై జవాన్ జై కిసాన్
ఏ కన్ను విలువ దానిదే
 ఉమాశేషారావు వైద్య
 లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments