ఆయన అలుపెరుగని దేశభక్తుడు!
వాజ్ పేయి ఔన్నత్యాన్ని వివరించిన కవి లెక్చరర్,ఉమాశేషారావు.
ఆయన ఒకకవి ,వక్త,జనసంఘ్ వ్యవస్థాపకుడు. భారతీయ జనతాపార్టీ వ్యవస్థపక అధ్యక్షుడు.అతి వాద ముద్ర ఉన్న,హిందుత్వ ముద్ర ఉన్న కూడా ఆయన మితవాదిగా ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్నారు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ లో పుట్టిన వాజ్ పేయి .చదువులోనుదిట్ట .క్విట్ ఇండియా ఉద్యమంలోపాల్గొని జైలు శిక్షణను అనుభవించారు
మొదట 2 వ లోకసభలో ప్రాతినిథ్యం పొంది 3,9 వ లోక సభలు మినహాయించి 14 వ లోకసభ వరకు ప్రాతినిత్యం వహించారు.రెండుపార్యాయలు ప్రాతినిత్యం తో పాటు మురార్జీ దేశాయి ప్రభుత్వం లో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి ఐక్యరాజ్య సమితి లో సాధారణసభలోమొట్టమొదటి సారి హిందీలో ప్రసంగించి ఖ్యాతి గడించారు.1996 లో ప్రధాని గా బాధ్యతలు చేపట్టిన ఒక్క ఓటు తేడాతో ఓడిపోయి పదమూడు రోజులకే పదవి కోల్పోయినాడు,1998 లో 13 నెలలు ప్రధానిగా పనిచేసి అప్పటి ఎ ఐ. డి.ఎం కె మద్దతు ఉపసంహరణ తో పదవి కోల్పోయిన 1999 లో ఎన్. డి.ఏ కూటమి ఆద్వర్యంలో ప్రధాని పదవి చేపట్టి అనేక సంస్కరణలుతెచ్చారు.అందులో గ్రామీణ సాడక్ యోజన,అంతర్జాతీయ ఒత్తిడులు ఎన్ని ఉన్నా పోక్రన్ అణు పరీక్షలు విజయవంతం గా నిలిపి అన్వయుధ దేశం గా మల్చినడు.కార్గిల్ విజయం నమోదులో,లాహోర్ బస్ యాత్రవంటిమైత్రిబంధంపెంచుకోవాలని చూసినపాకిస్తాన్ కుతంత్రాలు మానలేదు.1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డ్ దక్కడమే కాకుండా మోడీ ప్రభుత్వం భారత రత్న అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీస్వయంగాఇంటికి వెళ్లిఅందించారు.హిందీ,ఇంగ్లీషసంస్కృతభాషలోమంచిదిట్ట,దేశవిభజనసమయంలోన్యాయవాదవిద్యకుఆటంకంఏర్పడిందిఅయినఅనారోగ్యంతోక్రియాశీలరాజకీయాలనుండితప్పుకున్నారు. ఆయన పుట్టిన రోజు డిసెంబర్ 25 న సుపారిపాలన దినోత్సవంగాజరుపుకుంటున్నారు.ఆయన నిష్కళంక బ్రహ్మచారి,మచ్చలేని దేశభక్తుడు.రాజకీయమైన విబేధాలు తప్ప వ్యక్తిగత శత్రుత్వం లేని అజాతశత్రువు.ఆయన మృదు స్వభావి కవితాత్మకంగా ప్రసంగించి వారు. అతని వాగ్దాటి ముగ్దుడు అయిన నెహ్రు ఎప్పటికైనా ఈ దేశానికి ప్రధాని అవుతారు అని ఆనాడే కితాబు ఇచ్చారు.ఆయన మరణం లేని భారతీయ ఆత్మ .ఆటల్ జీ కి కూడి భుజం ఎల్.కె అద్వానీ.నేటి బి.జె.పి స్థితి కి నారు పోసి నీరు పోసింది వీరు ఇరువురు. జై జై
అటల్ జీ
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్
కామారెడ్డి