Pravahini

ప్రార్థన

అహంకారమో
అజ్ఞానమో
తెలియదు కానీ
అంతా తెలుసనే భ్రమ
పాతాళానికి
నిన్ను నన్ను తొక్కేస్తుంది
అయినా "నేను"ని
విడువలేని మూర్ఖత్వం...
మనిషిని
గుంజకు అల్లుకున్న తీగలా
బలంగా చుట్టుకుంటుంది
అహం అనే ఊబి
మనిషిని లాగుతుంది
'పై'కి వెళ్ళనీయదు 
పై పరమాత్మ
దొరికేదెలా
అహం పోయేదెలా
భగవంతుడా
తల్లిలా తప్పు దిద్దు
తండ్రిలా సరి దిద్దు
సరి చేసుకొని
సరిగా ఉండే
జీవితాన్ని
కొనసాగిస్తా...

- సాకి, 9949394688

0/Post a Comment/Comments