వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చండి - యువతకు అండగా నిలిచిన రోజే.... రైతులకు నిజమైనా రైతు రాజకీయ దినోత్సవాలు :
ఊకదంపుడు ఉత్తుత హామీలు మానండి..
ఇయ్యాల మా దోస్తొకడు వాట్సాప్ స్టేటస్ లో రైతు దినోత్సవ శుభాకాంక్షలు అని పెట్టుకున్నాడు. రైతులకు కూడా దినోత్సవం ఉందా, సెలెబ్రెట్ చేసే అంకితభావం , నిజమైన ప్రేమ ఉందా అని ఒక్కోసారి చూసుకుంటే బాధనే మిగులుతుంది. మొన్నటి ఎన్నికల దాకా రైతు సంక్షేమం పై ఊదరగొట్టిన పార్టీలు, నాయకులు కనీసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలపై - పరిష్కారాల గురించి చర్చించాలన్న సోయి లేకపాయే మీకు...
నన్నడుగుతే"రైతు దినోత్సవం" ఎన్నికలప్పుడు పెట్టుకోవాలి ! ఆగండాగండి ఏదేదో ఉహించుకోకండి. ఎందుకంటే ఎన్నికలప్పుడే నాయకులకు రైతుల మీద ఎనలేని,ఎక్కడలేని కపటపు ప్రేమ పుట్టుకు వస్తుంది. అడగని వరాలు కూడా గుప్పిస్తారు. ఊర్లలో వ్యవసాయం చేసే పొరగాండ్లకు"పిల్ల"ను ఇస్త లేరంటే,పెళ్లిళ్లుకాకుండాముదిరిపోయినబెండకాయలా మిగిలిపోతున్నారంటే వ్యవసాయం ఎంత తీవ్ర సంక్షోభంలో ఉందొ అర్ధం చేసుకొండి.
వ్యవసాయం చేసేటోడికి 5 ఎకరాలు ఉంటే ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదు. మరి 100 ఎకరాలు ఉన్నోడికి "రైతు బంధు"ఎందుకు..? ఒక్కసారి సానుకూలత తో ఆలోచించండి రైతును రౌతుగా కాకుండా ఒక శక్తి గా గుర్తించాలి పోషిస్తున్న రైతుకు పెన్షన్ ఇవ్వండి .లేకపోతే వ్యవసాయం చేయడానికి ఎవరూ ముందుకు రాక అన్నపూర్ణ అయిన నా దేశం అన్నమో రామచంద్ర అంటూ అడుక్కుతినే పరిస్థితివస్తుంది.నేటి యువత ఒక ఉద్యమం ల ముందుకు వచ్చి వ్యవసాయం దండగ కాదు పండుగ అనే విధంగా మార్పు చేయాలి. 5ఎకరాలు ఉన్నదని"ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు,తీవ్ర రోగాలు, ప్రమాదాలు సంభవిస్తే లక్షలు పోసి వైద్యం చేసుకొనే పరిస్థితి రైతులు లేరు.దయచేసి అటు వంటి వారికి"రైతు ప్రమాద భీమా"వర్తింపజేయండి..రైతు భీమాలాగా. ఎన్నికైన రాజకీయ నాయకులకు దేశ,విదేశాల్లో సైతం వైద్యం కోసం ఎంతైనా కర్చు చేస్తారు.
దుక్కి దున్ని పంట సాగుచేసి అష్టకష్టాలు పడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో ఆకాల నష్టం కలిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అధికారికంగా రైతును ఆదుకోవాలి.
పంటకు మద్దతు ధర కల్పించండి. ఉన్న మద్దతు ధర పెంచండి.కార్పొరేట్ మార్కెట్లలో నిత్యావసర ప్యాకెట్ ధర ఎందుకు పెరుగుతుందో,పండించే రైతు పంటకు ధర ఎందుకు తగ్గుతుందో ఆలోచించండి.
మీరు కాపాడాల్సింది దళారులను కాదు, రైతులను అని గమనించండి.
వేల కోట్లు అప్పుగా తీసుకొనే విజయ్ మాల్యా, నిరజ్ మోది లాంటి పారిశ్రామిక వేత్తలకు ఈ ప్రభుత్వాలు ఏడాదికి రూ. 5 లక్షల కోట్ల సబ్సిడీలను ఇస్తున్నాయి.నేటి ప్రభుత్వాలు రైతు తీసుకున్న లక్ష రూపాయల అప్పుకు లక్ష షరతులు, వేధింపులు,దీనితో ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి.కానీ వేల కోట్లు అప్పు తీసుకున్న బడా బాబులు మాత్రం దొరల్లాగా (దొంగలు) విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు.ఇలాంటివి ఎన్నో..ఎన్నెన్నో...సాక్షాలు
ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదని*"ఏలేటోల్లకు ఇదో హెచ్చరిక గమనించండి.
నిజాయితీగా రైతుల సంక్షేమం పై దృష్టి పెట్టండి. అంతేకాని ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్లు వేసేవారిగా చూడకండి. ఏ రాజ్యం కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు. కానీ వ్యవసాయ రంగంలో మాత్రం కొరత ఉంది. ఎందరో యువకులు రెడీ గా ఉన్నారు. మీరు చేయాల్సింది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే. ఓటు బ్యాంకు రాజకీయాల కోణం నుంచి కాకుండా భారతీయ ఆర్ధిక వ్యవస్థకు పూనాధిగా చూడాలి వ్యవసాయం వెన్నుముకగా గుర్తించాలి
ఉమాశేషారావు వైద్య
9440408080