సంక్రాంతి-నవకాంతి-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

సంక్రాంతి-నవకాంతి-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

సంక్రాంతి-నవకాంతి
---------------------------------------
వచ్చెను సంక్రాంతి
తెచ్చెను నవకాంతి
దుర్గుణాలు కాల్చిన
మెండుగ  మనశ్శాంతి

సంస్కృతికి ప్రతీక
సంక్రాంతి వేడుక
భారతీయులకిది
ఖరీదైన కానుక

సంక్రాంతి సరదాలు
ఉల్లసించు హృదయాలు
మూడు రోజుల జరుగు
ఘనంగా ఉత్సవాలు

ముంగిట్లో ముగ్గులు
దిగి వచ్చిన తారలు
భలే భలే సంక్రాంతి
తెలుగోళ్ళ విక్రాంతి

-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments