శీర్షిక: నిత్య చైతన్యం సలంద్ర కవిత్వం పేరు:యం. నూతన్ కుమార్

శీర్షిక: నిత్య చైతన్యం సలంద్ర కవిత్వం పేరు:యం. నూతన్ కుమార్

శీర్షిక:
*నిత్య చైతన్యం సలంద్ర కవిత్వం*

అందరికీ నమస్కారం, 
నాపేరు నూతన్ కుమార్. తొమ్మిదో తరగతిలో మాకు "కోరస్"  అనే పాఠం ఉన్నది. దీన్ని రాసింది సలంద్ర లక్ష్మి నారాయణ గారు. ఈయన ఎంతో గొప్ప కవి.  ఈయన దళిత సాహిత్యోద్యామానికి పునాది వేసిన మహనీయుడు. "దళిత మేనిఫెస్టో" ప్రచురించాడు. ఈయన రాసిన కోరస్ వచన కవిత చాలా బాగా రాసారు. కోరస్  కవితలోని అంతరార్ధాన్ని చూస్తే ఆ కవి గారి ఆలోచనలు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే సలంద్ర వారి కోరస్ కవిత చాలా గొప్పగా ఉంది. సమాజం కొత్త ధోరణి, వాస్తవాలను అంత తొందరగా అంగీకరించదనే విషయాన్ని గురించి కవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అనేక విధాలుగా తన ప్రశ్నలను, సందేహాలను కోరస్ కవిత వెలిబుచ్చారు.  లక్ష్మీనారాయణ సమాజంలో ధనికునికులకు ధనికులు పేదలను అంతరాన్ని చాలా గొప్పగా వివరించాడు. ఇది చదవడానికి వినడానికి చాలా బాగుంది. ఈయన లోకంలో మనుషులభధ్య వ్యత్యాసాలను భూమి ఆకాశాలకు మధ్య ఉన్నదూరంతో పోల్చారు. సమాజం బంధాలన్నీ డబ్బుతోనే ముడిపడ్డాయని గుర్తించాలని తెలియజేశారు. పూల సౌకుమార్యాన్ని ముల్ల కాఠిన్యాన్ని గ్రహించాలంటాడు. అలా సమాజంలోని విషయలను అన్యాయాన్ని ఎదిరించి చూపినపుడు "చూపుడు వేళ్ళతో చంపేస్తారని" బాహాటంగానే ప్రకటించాడు. ఈయన రచించిన 1979లో కొన్ని "చావుగీతం" కవితా సంపుటి సంచలనం సృష్టించింది. నీటి ప్రవాహంలోని చైతన్యానికి నీటి నిశ్చలత్వానికి గల తేడాను గ్రహించాలంటాడు. ఇవేమీ తెలుసుకోకుండా కోపంతో అపార్థం చేసుకోవద్దంటాడు. ఈయనకు చిన్నతనం నుండి "హేతువాద దృష్టిని" ఏర్పరచుకున్నాడు. అలాగే ఈయన "వేడిగాలి" అనే కవితా సంకల్పం ద్వారా మొదటి కవితా సంపుటిని అందించారు. ఈయన కవిత్వం చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. సలంద్ర లక్ష్మీనారాయణ గురించి తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. సమాజాన్ని సూక్ష్మ దృష్టి కలిగి పరిశీలంచాలనడం బాగుంది.

యం. నూతన్ కుమార్,
9వ, తరగతి,
జి.ప.ఉ.పాఠశాల, అమడబాకుల,
వనపర్తి జిల్లా.

0/Post a Comment/Comments