Pravahini

నేడే వసంత పంచమి.దాని విశిష్టత వివరించిన
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య:
కామారెడ్డిజిల్లా, దోమకొండ 25జనవరి (ప్రజాజ్యోతి).
మాఘమాసం లో వచ్చే అతి ముఖ్యమైన పంచమివసంతపంచమి,దీనినేశ్రీపంచమి,మదన పంచమి అనికూడా అంటారు.సరస్వతి దేవి జయంతి ఈ రోజు.సర్వవిద్యాలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడాలేకుండాపుస్తకాలు
పెన్నులు దగ్గరపెట్టి ఆరాధిస్తారు.సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ తల్లే ఆధారం కనుక నృత్యకేళి విలాసాలతో ఆరాధిస్తారు.ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించు మని బ్రహ్మవైవర్త పూరణం చెపుతుంది.సరస్వతి ని ఆరాధించే పద్దతిని నారదుని కి విష్ణుమూర్తి వివరించారు.
     శిశిరరుతువులో వసంతుని స్వాగత చిహ్నం గా దీన్ని భావిస్తారు.ఋతు రాజు వసంతుడు కనుక వసంతుని,ప్రేమను కల్గించే వాడు కనుక మదనుణ్ణి,అనురాగవ ల్లి  అయిన రతిదేవినీప్రేమించబడడం కూడా ఈ రోజే ప్రారంభం అయింది.ఈ ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.
 ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే వాక్సుద్ధి కలుగుతుంది. మెద,ఆలోచన,ప్రతిభ,ధారణ,ప్రజ్ఞ,స్ఫురణ శక్తుల స్వరూపామే సరస్వతి.దుర్గాదేవి నవరాత్రులలో మూల నక్షత్రం రోజున సరస్వతి దేవి ఆకారం లో పూజిస్తారు.
చంద్రిక చంద్రవదన తివ్రా మభద్ర మహాభలా భోగద భారతి భామా గోవిందా గోమతీ శివా అని ప్రతి రోజూ గాని తల్లి కటాక్షం సిద్ధిస్తుంది అని నమ్మకం.
శాంతి,అహింస లకు ప్రతీక సరస్వతి సర:అంటే కాంతి చీకట్లను తొలిగించి కాంతిని ఇచ్చేదే సరస్వతి.
వాగేశ్వరివాగేశ్వరి,మహాసరస్వతి,సిద్ధసరస్వతి, పరా సరస్వతి,బాల సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ "సామాం పాతు సరస్వతి "అని పూజించే వారే సరస్వతి కి ఎక్కువ ప్రీతి పాత్రులు.వ్యాసుడు,వాల్మీకి ,వశిష్ఠుడు ఈ తల్లి దీవెనల తో పురాణాలు,గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగింది పూర్వం అశ్వలాయణుడు,అదిశంకరుడు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.

0/Post a Comment/Comments