కథ: స్నేహితులు పేరు: బి.యమున

కథ: స్నేహితులు పేరు: బి.యమున

స్నేహితులు

అమలాపురం అనే గ్రామం అందమైన పల్లెటూరు. అక్కడ మనుషులందరు ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఆ ఊరిలో ఒక ఉన్నత పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో రకరకాల విద్యార్థులు, కొందరు బీదవారు, మరికొందరు వ్యవసాయ పనులతో కాలంగడుపుతూ ఉన్నంతలో తమ పిల్లలు చదువుకునేందుకు వీలుగా పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నారు. విద్యను బోధించే గురువులను విద్యార్థులు చాలా గౌరవించేవారు ఆ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, సమాజంలో జరిగే మంచి చెడ్డలను బోధిస్తూ నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా ఆ విద్యార్థులను గురువులు తీర్చిదిద్దేవారు. ఇటువంటి పాఠశాలలో చదవడం ఆ పిల్లల అదృష్టం అని, ఆ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు భావించేవాళ్లు. ఆ పాఠశాల ప్రాంగణం పచ్చని చెట్లతో చాలా అందంగా ఉండేది. అటువంటి పాఠశాలలో ఒకరోజు ఒక విషాదం చోటు చేసుకున్నది. దానికి కారణం ఇద్దరు మిత్రులు గొడవ పడటం వారిద్దరూ ప్రాణ స్నేహితులు. వారి పేర్లు చందు మరియు నందు. చందు నందు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఒకే దగ్గర కూర్చుంటారు. వారిద్దరూ అలా ఉండడం నచ్చని తమ తోటి విద్యార్థి అయిన రాము తట్టుకోలేకపోతున్నాడు. వారిద్దరూ విడివిడిగా ఉన్నప్పుడు ఒకరి గురించి మరొకరితో చెడుగా చెప్పి వారి మధ్యలో గొడవ పెట్టి, రాము చాలా సంతోషించేవాడు. ఆ గొడవ తర్వాత నందుకు చందుకు ఉన్న స్నేహం ద్వేషంగా మారింది. చందుతో ఊరికే గొడవ పడేవాడు నందు. అలా వారిద్దరి మధ్యలో ఒకరోజు చాలా పెద్ద గొడవ జరిగి శత్రువులుగా మారారు. వారిద్దరి పాఠశాల విద్య అలాగే కళాశాల విద్య కూడా ముగిసింది. అదే సంవత్సరంలో ఎన్నికలు వచ్చాయి వారికి ఓటు హక్కు కూడా వచ్చింది. వారిద్దరూ పోటీ పడాలనుకుంటారు. చిన్న మనస్పర్థలు వారిద్దరిని దూరంచేశాయి.వారిద్దరికీ  పాఠాలు చెప్పిన గురువుగారు ఓరోజు తారసపడ్డాడు. ఆ క్షణంలో ఇద్దరు వెళ్లి "గురువు గారు బాగున్నారా" అని నమస్కారం చేస్తూ పలకరిస్తారు. కాని వారిద్దరూ ఎడమొహం పెడమొహాలతో ఉండడం గమనించిన గురువుగారు "ఏంట్రా నందు, చందూ మీరిద్దరూ ఇంకా అలాగే ఉన్నారా? స్నేహితుల మధ్య అహం అడ్డురాకూడదు, చిన్నతనంలోని విషయాలన్నీ పక్కనపెట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిమెలిసి ఉండండి. మనం పదవ తరగతిలో నేర్చుకున్న శతకపద్యాలు మరచిపోయారు కదా.. మిత్రులు ఒకరినొకరు అర్థం చేసుకుని కష్టసుఖాలను పంచుకుని, ఆపదలో ఆదుకునే గుణాన్ని కలిగి, నీ చేతిలో కత్తిలా ఉండాలని నేర్చిన పద్యాన్ని మరిచారా. మీరిద్దరూ కలిసి ఊరికి ఉపకారం చేయండి" అంటూ మంచిమాటలు చెప్పారు. ఆ మాటలు విని ఇద్దరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుని కలిసిపోతారు. పిల్లలు మారారని చాలా సంతోషించాడు గురువుగారు. ఆ తర్వాత చందు ని ఆ ఊరి ప్రజలు సర్పంచ్ గా ఎన్నుకుంటారు చందుకు తోడుగా నందు కూడా ఉండి ఊరికి తన వంతు సహాయం చేస్తాడు. నందు మారడానికి కారణమైన గురువుగారిని వారు ఎప్పుడు మర్చిపోమని అని అన్నారు రాము లాంటి మిత్రులు వచ్చి ఎన్ని గొడవలు పెట్టినా, వారినెవరూ విడదీయలేకపోయారు. ఇద్దరు కలిసి గ్రామ అభివృద్ధికి పాటుపడి అందరి మన్ననలు అందుకుని సంతోషంగా జీవిస్తారు.

బి. యమున,
10వ, తరగతి,
జి.ప.ఉ.పాఠశాల, అమడబాకుల,
కోత్తకోట మండలం,
వనపర్తి జిల్లా.

0/Post a Comment/Comments