అమ్మాయి
అమ్మ దాగి ఉంది
ఇల్లలు దాగి ఉంది
మాయి మరాఠీ లో
అమ్మ దాగి ఉంది
కంటికి రూపం
ఇంటికి దీపం
మమతకు అపురూపం
ప్రతి ఇంటికి ఆడపిల్ల మణి దీపం
ప్రతి సృష్టి లేదు
ప్రగతి లేదు
అడుగు అడుగున ఆటంకలు
అక్షరాలు చాలవు
చీకట్లను పారద్రోలి
సమస్యలను ఛేదించి
గగనం నుంచి పూడిమి
వరకు కీర్తి పతాకం ఎగరవేసిరి
ఒక గిరిజన మహిళ దౌ)పది ముర్మ్ ఒక ఉదాహరణ
ఒక సమ్మక్క సరక్క
ఒక ఐలమ్మ ఒక పూర్ణ
ఒక.మేరీక్యూరి
ఇంటి నుండి దేశ చరితను
మర్చిరి ఒక ఇందిరా.ఒక సిరిమువ బండారునాయ కె
తల రాత ఎలా ఉన్నా తలరాతలు మార్చిన ఘనత
అమ్మయిలదే
అమ్మాయి ల హత్యలు వద్దు
ఆడపిల్ల లేని ఇల్లు
లక్షిమి లేని ఇల్లు
ఆమె ను గౌరవిద్దాం
ఆమెను ఎదుగానిద్దాం
అ తో నే అక్షరమాల
ఆ..తోనే ఆడది
స్థితి కారిణి,లయ కారిణి,చర కారిణి
ఆడపిల్ల ఆదిశక్తి
చదువుల తల్లి సరస్వతి
జీవనదులు స్త్రీ పేర్లు
ఎక్కడ ఆమె లేనిది
అమావాస్య కొద్దిసెపే
అణగదొక్కితే అంతే వేగంగా
పైకి లేస్తుంది
అమ్మాయి నిత్యం ప్రసరించే
వెన్నెల
ఆమె ను ఎదుగానిద్దాం
సానుభూతి కాదు ఆటంకాలు
సృష్టించకు
పాలనలో ఇందిరా సేవల్లో తెరిస్సా
ఎవరెస్టు అధిరోహించిన పూర్ణిమ రామాయణ0
ఎందరో మరెందరో
సృష్టి చర స్థితి,లయ
కారిణీ ఆమె
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి
9440408080
Post a Comment