కన్న తల్లి-కల్పవల్లి' పుస్తకావిష్కరణ-గద్వాల సోమన్న

కన్న తల్లి-కల్పవల్లి' పుస్తకావిష్కరణ-గద్వాల సోమన్న

'కన్న తల్లి-కల్పవల్లి' పుస్తకావిష్కరణ
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న  రచించిన 29వ, కొత్త పుస్తకం 'కన్న తల్లి-కల్పవల్లి' బాలగేయాల సంపుటి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్  గౌ౹౹శ్రీ  మందపాటి శేషగిరిరావు గారి చేతుల మీద,కర్నూలు గ్రంథాలయ చైర్మన్ శ్రీ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన "మనం-మన గ్రంథాలయం"కార్యక్రమం సందర్భంగా,కేంద్ర గ్రంథాలయం,కర్నూలులో ,జనవరి7,2023న  ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం అనతి కాలంలో 29పుస్తకాలు ప్రచురించడమే కాకుండా,బాలసాహిత్యంలో  విశిష్ట సేవలకు గానూ గద్వాల సోమన్న సాహితీ సేవలు ముఖ్య అతిథులైన వక్తలు గొనిడాడారు. ఈ కార్యక్రమంలో నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ అధ్యక్షులు మద్దులేటి,కర్నూలు గ్రంథాలయ కార్యదర్శి ప్రకాష్ , లైబ్రరీన్లు పెద్దక్క, గోవింద్ రెడ్డి,కవి స్వరూప సిన్హా ,విద్యార్థులు మరియు  పుర ప్రముఖులు మరియు  శ్రేయోభిలాషులు  పాల్గొన్నారు.

0/Post a Comment/Comments