శీర్షిక:నేను చదివిన కథల పుస్తకం. పేరు:సి.హేమలత

శీర్షిక:నేను చదివిన కథల పుస్తకం. పేరు:సి.హేమలత

శీర్షిక: నేను చదివిన కథలు

నేను ఈ మధ్య ఒక కథల పుస్తకం చదివాను దాని పేరు "నిజామాబాద్ జిల్లా బడి పిల్లల కథలు". ఈ కథల పుస్తకం యొక్క సంపాదకుడు మణికొండ వేద కుమార్ గారు. ఈ పుస్తకంలో మొత్తం 18 అద్భుతమైన కథలు ఉన్నాయి. ఈ పుస్తకంలో నాకు ఈ 18 కథలు చాలా బాగా నచ్చాయి. ఈ కథలు మొత్తం చిన్న పిల్లలు మాత్రమే రాశారు. 18 వేరు వేరు జిల్లాల బడి పిల్లలు అందరూ రాశారు. ఎవరైనా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటే ఇలాంటి కథలు చదువుతే చాలు. వాళ్ళ మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఈ కథలను చదివితే, ఎవరైనా బాలలు రాబోయే కాలంలో మరింతమంది బాల రచయితలుగా మారుతారు.  ఈ కథల పుస్తకాన్ని చదివి, ఈ కథల ద్వారా స్ఫూర్తిని కూడా పొందవచ్చు. ఈ పుస్తకంలో కథల పేర్లు బంగారు శిల్పం, చదువు ప్రాముఖ్యత, మంచి స్నేహితులు, మంచి చెడు, సహాయం, అన్నం పరబ్రహ్మ స్వరూపం, సహాయం చేసే స్నేహితురాలు, అనే కథలు చాలా బాగున్నాయి.  ఈ కథలను చాలామంది పెద్దవాళ్లు కానీ, చిన్నపిల్లలు గాని చాలా ఇష్టపడతారు. ఈ కథలను పిల్లలు చాలా అద్భుతంగా రాశారు. నైతిక విలువలను  తెలియజేస్తూ రాశారు. ముందుగా నేను కొంచెం చదివినప్పుడు చిన్నపిల్లలు రాశారా అని సందేహం వచ్చింది. కథలు మామూలుగా ఉంటాయనుకుని చదివాను. కానీ మొత్తం చదివాక తెలిసింది, ఈ కథలను నాలాంటి బడి హపిల్లలు రాసిన గాని చాలా బాగా రాశారు అని అర్థమైంది.  అంతేకాకుండా ఈ కథలు ఎంతోమందిని ఆకర్షించాయి. ఈ కథలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ కథలను ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఒక గొప్ప రచయితని కావాలని అనుకుంటున్నాను. ఎవరికైనా కథలు అంటే చాలా ఇష్టం. ఇలాంటి కథలు చదివి చిన్నప్పుడు రచయితలుగా మారండి. అలాగే మీరు మీ పిల్లలను చిన్నప్పుటి నుండే కథలు రాయించడం నేర్పండి. వాళ్ళు కూడా భవిష్యత్తులో చాలా గొప్ప గొప్ప రచనలు చేయడానికి పూనుకుంటారని  నేను భావిస్తున్నాను. ఈ కథల పుస్తకం చదివాలని, స్ఫూర్తి పొందాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.

సి. హేమలత, 
10వ‌,తరగతి,
జి.ప.ఉ.పాఠశాల, అమడబాకుల,
వనపర్తి జిల్లా.

0/Post a Comment/Comments