రసభరితం ఈ మధురిమలు(పుస్తక సమీక్ష)

రసభరితం ఈ మధురిమలు(పుస్తక సమీక్ష)

రసభరితం ఈ మధురిమలు
(పుస్తక సమీక్ష)
----------------------------------------
గణితశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నా ప్రవృత్తి పరంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న శ్రీ గద్వాల సోమన్నగారు బాలసాహిత్యంలో అందెవేసిన చేయి! ప్రతీ రోజూ బాల గేయాలు వ్రాయడం, వాటిని పద్దతి ప్రకారం పుస్తకం రూపంలో ముద్రణ చేయించారు.వీటిని పలు గ్రంథాలయాలకు ఇస్తూంటారు.ఆ విధంగా కొన్ని సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు లో మంచిపేరు పొందారు.అనేక ప్రక్రియలలో  వ్రాయడంతో ఈ సారి మధురిమలు లో
*సోమన్న మధురిమలు*బాల గేయాలు వెలువరించారు. అలతి పదాలతో వ్రాసిన ఈ గేయాలు ముచ్చటగా ఉన్నాయి.పిల్లలూ అర్థం చేసుకునే సరళ భాష లో ఇవి ఒక్కో అంశానికి సంబంధించిన చక్కని చిత్రాల ద్వారా మరింత అవగాహన కలుగుతుంది.
ఇక పుస్తకం లో విషయం చూద్దాం.

మొదటి మధురిమలోనే
భగవంతుని నామము
సతతం స్మరించాలి
దొరుకుతుంది శాంతము
మదిని పూజించాలి !
అన్నారు. ఆధ్యాత్మిక భావన పిల్లల లో ఆవేశ కావేషాలు తగ్గించి వేస్తాయి. బుధ్ధి వక్ర మార్గంలో పయనించకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఇక పసిపిల్లలు శీర్షిక ద్వారా... "రారాజులు గృహమున/ముద్దులొలికు బాలలు/దగా లేదు మనసున/వా రుకదా వెల్పులు!" అన్నారు. తల్లిదండ్రులు గురించి.. కష్టబెట్టకూడదు/
వారి దొడ్డ మనసులు/చులకన చేయరాదు/వారిచ్చిన బ్రతుకులు! అని హితవు పలుకుతున్నారు సోమన్న గారు. సర్కారు బడీ వీరి గేయాల్లో సరళంగా వర్ణించారు. చివరిలో ఖర్చు అసలే లేనిది/సర్కారు బడికి రండి/భరోసా ఒసంగునది/మేలులెన్నొ పొందండి అన్నారు . గురుదేవులు అంశంపై..
"చూపుతారు మార్గము/జీవితాన గురువులు/తాకినచో ధన్యము/వారి ఘన చరణములు!"సత్యం.
సాటి లేని మేటి నాన్న శీర్షిక  నాన్నమీద, కష్టించు శ్రామికుడు/నడిపించు నాయకుడు/నిస్వార్థ ప్రేమికుడు/ఇంటిలోనజనకుడు! అన్నారు.
త్యాగమయి తల్లి గురించి, "పలుకులే తీయన/ప్రగతి కిల వంతెన/అమ్మ ఇంట దీవెన/లేకున్న వేదన"న్నారు. తల్లినే ఎదిరించే నేటి పిల్లల కోసం ఇది ప్రత్యేకo!
బాల్యము భాగ్య మని చెప్తూ.. "చింతలేని బాల్యము/అదే స్వర్గ తుల్యము/పరిమళించే గంధము/మరుపురాని బంధము!" ఆహా! అద్భుతం. కామధేనువు చదువు /మేలులెన్నో కలవు/జ్ఞాన సిరులకు నెలవు/చదువు వలనే కొలువు! అనీ తేల్చారు. "చదువుకున్న బాలిక/దీపిక సదనం లో/భగవంతుని కానుక/తారక గగనం లో!"అదెంతో నిజం.
"ఆరోగ్యమే భాగ్యము/పాటించుము నియమాలు/అనారోగ్యం భూతము/కుడుపునౌజీవితాలు!" అని తెలిపారు. ప్రబోధ గీతంగా" చేతనైన సాయం తో/గండం దాటించాలి/ఒక్కింత త్యాగం తో/మనిషితనం చూపాలి! అని వ్రాసారు. ఇంకా ఈ పుస్తకం లో బాలభానుడు, నిత్య సత్యాలు, పిల్లలం-మల్లెలం,వనితయింట ఘనత, పవిత్ర గ్రంథాలయాలు,బడి గంట సందేశం, మంచి అలవాట్లు, హితోక్తులు వంటి అనేక కవితలున్నాయి.  చక్కని పండ్ల ఆ ముఖచిత్రం తో అలరతున్నది. ముందు మాటలు వ్రాసిన మీసాల హరిప్రసాద్ గారు (భౌతిక శాస్త్ర ఉపన్యాసకులు) ఈర్ల సమ్మయ్య గారు ;(ప్రభుత్వ ఉపాధ్యాయులు , ప్రక్రియ సృష్టి కర్త), డా. వైరాగ్యం ప్రభాకర్ గారు(కవి, రచయిత, విమర్శకులు) సోమన్న గారి ప్రయత్నము చాలా బాగుందనీ బాల సాహిత్యం ద్వారా మరింత అవగాహన కలిగించారు అన్నారు.28 పుస్తకాలు ప్రచురించిన సోమన్న గారినుండి మరిన్ని మంచి పుస్తకాలు అభిలషిస్తు న్నాము. శుభాిభి నందనలతో.. ఎం. వి.ఉమాదేవి .7842368534.

ప్రతులకు
గద్వాల సోమన్న
99664 14580

0/Post a Comment/Comments