144 తరువాత వస్తున్న మహిమాన్వి త శివరాత్రి

144 తరువాత వస్తున్న మహిమాన్వి త శివరాత్రి
ఫిబ్రవరి 18.వ తేది న వస్తున్న.... మహా శివ రాత్రి...144 సంవత్సరాలు తరువాత.... వస్తున్న మహా మహిమన్విత మైన పర్వ దినమా ?
అవును నిజమే.శని త్రయోదశి.., మహాశివరాత్రి...శని ప్రదోషం.
ఓకే రోజు...అదీ శని వారం  రావడం... దేనికి సంకేతం...?
కలియుగం లోని జీవులన్నింటికి ఆధిపత్యం వహించేవాడు...కలియుగానికి రాజు శనిదేవుడుశివరాత్రి నియమాలు పాటించడం ద్వారా జీవులకు జన్మరాహిత్యాన్ని పరమ శివుడు ప్రసాదించి తుదకు మోక్షంను అనుగ్రహిస్తాడు.అయితేశనిదేవుని ద్వారా కర్మ పరిపక్వత చెందాలి. శనివారం శని త్రయోదశి - శని ప్రదోషం వున్నది కావున ముందుగా శని దేవునికి తైలాభిషేకం పూజలు తదుపరి అదేరోజు శివునికి ప్రత్యేకంగా వీలుంటే స్వయంగా మీరే అభిషేకం చేసుకోగలిగితే చాలు.అందువల్ల ఇది ఎంతో ప్రముఖ మైనది.
శనివారం మహాశివరాత్రి రావడం చాలా సహజం,అందునా శని త్రయోదశీ ప్రదోషం శివరాత్రి కలిసి రావడం అనేది ఎంతో అరుదుగా వస్తుంది. ఎంతో అరుదుగా వచ్చే ఈరోజున అత్యంత అరుదుగా నిర్మాణం అయిన వినుకొండ శనైశ్చరాలయం లో శని దేవునికి అభిషేకం చేసి పరిపూర్ణ ఫలితాలు పొందవచ్చు..ఒక సారి పరిశీలించి ఆలోచన చేసి చూడండి..
శనివారం ఉదయకాల త్రయోదశీ, ప్రదోష కాల త్రయోదశి రెండు ముఖ్యమైనవే.
మహాశివరాత్రి నియమములుఉల్లంఘిచకుండా
శనిత్రయోదశీ (శని ప్రదోషం) పూజలు నిర్వహించడం శుభ ఫలితాలు ఇస్తుంది.

ఉదయ వ్యాప్తి, ప్రదోష వ్యాప్తి రెండింటికీ....
రెండు వేరు వేరు నియమాలు వ్రతములు ఉన్నవి..శని త్రయోదశీ ఉదయకాలం, ప్రదోషకాలం ఉన్న రెండింటి గురించి.... వివరం గా భవిష్యోత్తరం‌లో, స్కాందంలో‌ చక్కగా చెప్పారు,.... రెండింటిలో ఈశ్వరారాధన చేయాలి దానికి ముందు శని దేవునికి అర్చన చేయాలి అని...
అలాగే మహా శివరాత్రి కి కూడా ఈశ్వరారాధన చేయుట ప్రధానం.అష్టయామములలో అలాగే లింగోద్భవ కాలములో కలిపి తొమ్మిది పూజలు ఆచరించుట..శివరాత్రి నియమం లేదా శివరాత్రి వ్రతం..కనుక ఎవరిని ముందు పూజించాలి మొదట ఏం‌చేయాలి అని,.... కాలయాపన చేయక...ముందుగా శని దేవునకు తదుపరి శివ  పరమాత్మను మనస్సు యందు స్మరిస్తూ....
*యథాశక్తి ఆ శనీశ్వర ఆరాధన లో ఉండటం శ్రేష్ఠం.
.      మీ అందరికి శివుని ఆశిస్సులు,శని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్

0/Post a Comment/Comments