Pravahini

పత్రికా ప్రకటన
---------

 ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డా.చిటికెన కిరణ్ కుమార్ ను వరించిన పురస్కారం
==========
అంతర్జాతీయ ఐ.ఎస్.వో గుర్తింపు  పొందిన మనం ఫౌండేషన్ సంస్థ వారు వివిధ రంగాలలో ప్రతిభావంతులకు ఇటీవలే  అవార్డులు అందజేశారు.
          
      తెలంగాణ రాష్టం  సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్తగా రాణిస్తూ కవిగా, రచయితగా,సంపాదకీయ వ్యాసకర్తగా విమర్శకుడిగా, *ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్* సభ్యుడిగా  బాధ్యతలు నిర్వహిస్తూ  తెలుగు సాహిత్యంలో  సేవ చేస్తున్న 
డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్
 సమాజాన్ని ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ అనేక వ్యాసాలు, కధలు,  కవితలు పుస్తక సమీక్షలు వ్రాసారు. ఈయన రాసిన 600 పైచిలుకు వ్యాసాలు  దాదాపు 60 పత్రికలలో  ప్రచురితమైనాయి. ప్రపంచ శిఖరాగ్ర శాంతి సదస్సులలో పాల్గొని తెలుగువారి ఘన కీర్తిని చాటి చెప్పిన కలం యోధుడు.అద్భుతమైన వ్యాసాల గ్రంథకర్త, *చైతన్య స్ఫూర్తి* ప్రధాత.. *ఓ...తండ్రి తీర్పు లఘుచిత్ర కథా రచయిత* 
వీరు  వివిధ సాహిత్య సంస్థల నుండి పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. కిరణ్ కుమార్ సాహిత్య పరంగా బహు ముఖంగా వివిధ రూపాలలో అందిస్తున్న  సేవలను గుర్తించి *ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు 2023* ను  ఆన్ లైన్ ద్వారా  సంస్థ ఫౌండర్ , చైర్మన్ .కె. చక్రవర్తి అందజేశారు. ఈ సందర్భంగా చిటికెన ఒక ప్రకటనలో  పురస్కారం అందించిన సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు.

0/Post a Comment/Comments