రవీంద్ర భారతి వేదికపై గౌరవ అతిథిగా
ప్రసంగించిన ప్రముఖ సాహితీవేత్త -డా.చిటికెన
--------------------
నవభారత నిర్మాణ సంఘం వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం,
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రోజున రవీంద్ర భారతి హైదరాబాద్ లో సాహితీ కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి కవులు, రచయితలకు సంఘ అధ్యక్షులు సూరేపల్లి రవికుమార్ పురస్కారాలు అందించారు. ఇట్టి కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, ఎడిటోరియల్ కాలమిస్ట్ ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. సాహితీ మూర్తులను ఉద్దేశించి చిటికెన మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా కవులు కవయిత్రులు తమ యొక్క ప్రతిభ పాటవాలతో ఉత్తమ రచనలు చేశారని అందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకులు అమృత్ కుమార్ జైన్ , ఆషిశ్ విద్యాసంస్థల అధ్యక్షురాలు భారతి, రామకృష్ణ చంద్రమౌళి, తోట శ్రవణ్ కుమార్, సంపత్ కుమార్, కవి సమ్మేళనం అధ్యక్షురాలు -డా.రాధా కుసుమ తో పాటుగా వివిధ ప్రాంతాల నుండి దాదాపు 100 వరకు కవులు రచయితలు హాజరై నారు.